Latest Crime News: హైదరాబాద్‌లోన్ హయత్‌నగర్‌లో విషాదం నెలకొంది. రాఘవేంద్ర కాలనీలో ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఆ కాలనీకి చెందిన మమత(20), గౌతమి(21) స్నేహితురాళ్లు.. పక్క పక్క ఇళ్లలో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు. శుక్రవారం మమత ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. వీరిద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఆ రోజు మమత తల్లిదండ్రులు ఓ శుభకార్యం కోసం మహబూబ్‌నగర్‌కు వెళ్లగా.. సోదరుడు స్కూల్‌కు వెళ్ళాడు. సాయంత్రం ఆమె సోదరుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి.. ఇద్దరూ ఇంటి పైకప్పు రాడ్‌కు వేలాడుతూ కనిపించారు. స్థానికుల వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనాస్థలానికి చేరుకొని పూర్తిగా పరిశీలించారు. ఇక అక్కడ వారికి లభ్యమైన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు తాము భారంగా మారడం వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని యువతులు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.