AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతున్నారా? అయితే ఈ తెలిస్తే షాక్‌ అవుతారు!

ల్యాప్‌టాప్‌ను షట్‌డౌన్ చేయాలా లేదా ఆన్‌లో ఉంచాలా అనే సందేహానికి నిపుణులు స్పష్టమైన సూచనలు ఇస్తున్నారు. ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచితే హార్డ్‌వేర్ జీవితకాలం తగ్గుతుంది, బ్యాటరీ దెబ్బతినే అవకాశం ఉంది. ప్రతిరోజూ ఒకసారి షట్‌డౌన్ లేదా రీస్టార్ట్ చేయడం వల్ల కాష్ క్లియర్ అయ్యి, సిస్టమ్ పనితీరు మెరుగుపడుతుంది.

ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతున్నారా? అయితే ఈ తెలిస్తే షాక్‌ అవుతారు!
Laptop Shutdown
SN Pasha
|

Updated on: Mar 10, 2026 | 5:52 PM

Share

ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌ను ఉపయోగించిన తర్వాత దాన్ని షట్‌డౌన్ చేయకుండా కొంతమంది అలాగే ఆన్‌లోనే ఉంచేస్తూ ఉంటారు. కొందరు పదే పదే ఆన్-ఆఫ్ చేయడం వల్ల యంత్రంపై ఒత్తిడి పెరుగుతుందని చెబుతారు. మరోవైపు ఎప్పుడూ ఆన్‌లో ఉంచితే హార్డ్‌వేర్ త్వరగా అరిగిపోతుందని మరికొందరు భావిస్తారు. అయితే నిజంగా ఏది మంచిదో నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు.

ఆన్‌లో ఉంచితే లాభాలు

  • కంప్యూటర్ బూట్ అయ్యే వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. మీరు ఆపిన చోట నుంచే వెంటనే పని ప్రారంభించవచ్చు.
  • మీరు ఇంటి బయట ఉన్నా, రిమోట్ యాక్సెస్ ద్వారా కంప్యూటర్‌ను ఉపయోగించవచ్చు.
  • మీరు నిద్రపోతున్నప్పుడు సిస్టమ్ విండోస్ అప్‌డేట్‌లు, గేమ్ డౌన్‌లోడ్‌లు లేదా యాంటీ వైరస్ స్కాన్‌లను పూర్తి చేయగలదు.

ఆన్‌లో ఉంచడం వల్ల నష్టాలు

  • బ్యాటరీ ఎక్కువగా ఖర్చవుతుంది, తరచూ ఛార్జ్ చేయాల్సి వస్తుంది.
  • అంతర్గత భాగాలకు విశ్రాంతి లభించకపోవడం వల్ల హార్డ్ డ్రైవ్ లేదా SSD వంటి హార్డ్‌వేర్ జీవితకాలం తగ్గే అవకాశం ఉంటుంది.
  • బ్యాటరీ వేగంగా దెబ్బతినే అవకాశం ఉంది.
  • సిస్టమ్‌ను ఎక్కువకాలం రీస్టార్ట్ చేయకపోతే సాఫ్ట్‌వేర్ హ్యాంగ్ అవ్వడం లేదా క్రాష్ కావడం జరుగుతుంది.

నిపుణుల ప్రకారం రోజుకు కనీసం ఒకసారి షట్‌డౌన్ లేదా రీస్టార్ట్ చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల కాష్ మెమరీ క్లియర్ అవుతుంది, సిస్టమ్ పనితీరు మెరుగుపడుతుంది. మీరు రోజంతా ల్యాప్‌టాప్‌ను ఉపయోగిస్తుంటే, పూర్తిగా ఆఫ్ చేయకుండా Sleep లేదా Hibernate మోడ్ ఉపయోగించవచ్చు. మీరు ఆఫీస్ పని కోసం మాత్రమే ఉపయోగిస్తే, పని పూర్తయ్యాక షట్‌డౌన్ చేయడం ఉత్తమం. వారానికి కనీసం ఒకసారి రీస్టార్ట్ చేయడం తప్పనిసరి. మొత్తానికి, కంప్యూటర్‌ను ఎప్పటికీ ఆన్‌లో ఉంచడం కంటే సరైన సమయంలో షట్‌డౌన్ చేయడం లేదా స్లీప్ మోడ్ ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే మీ ల్యాప్‌టాప్ పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది, హార్డ్‌వేర్ జీవితకాలం కూడా పెరుగుతుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us