లలితా జ్యువెలరీ చోరీ కేస్‌లో న్యూ ట్విస్ట్: అసలు సూత్రధారి ఎవరంటే..?

| Edited By:

Oct 04, 2019 | 12:47 PM

లలితా జ్యువెలరీ కేస్.. తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా.. సంచలనం సృష్టించింది. షాపులో జరిగిన చోరీ కేసులో చెన్నై పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రెండున్నర కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సినీ ఫక్కీలో చోరీకి తెగపడిన ఈ ముఠా వెనుక ఎవరున్నారు అనే కోణంలో నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. పరారీలో వున్న మిగతా నిందితులను పట్టుకునేందుకు స్పెషల్‌ టీమ్స్‌ను రంగంలోకి దింపారు. అయితే.. ఈ చోరీకి ప్రధాన సూత్రధారి ఎవరనేది పోలీసులు […]

లలితా జ్యువెలరీ చోరీ కేస్‌లో న్యూ ట్విస్ట్: అసలు సూత్రధారి ఎవరంటే..?
Follow us on

లలితా జ్యువెలరీ కేస్.. తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా.. సంచలనం సృష్టించింది. షాపులో జరిగిన చోరీ కేసులో చెన్నై పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రెండున్నర కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సినీ ఫక్కీలో చోరీకి తెగపడిన ఈ ముఠా వెనుక ఎవరున్నారు అనే కోణంలో నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. పరారీలో వున్న మిగతా నిందితులను పట్టుకునేందుకు స్పెషల్‌ టీమ్స్‌ను రంగంలోకి దింపారు. అయితే.. ఈ చోరీకి ప్రధాన సూత్రధారి ఎవరనేది పోలీసులు కనిపెట్టారు. అతని పేరు.. తిరువారూర్‌ మురుగన్.. ఇన్వెస్టిగేషన్‌లో నిందితుడి చెప్పినట్టుగా సమాచారం. దోపిడీలో మొత్తం 8 మంది పాత్ర ఉన్నట్టు గుర్తించిన పోలీసులు. తిరువారూర్ మురుగన్, అతని కుటుంబ సభ్యుల కోసం కూడా ప్రత్యేక పోలీసు బృందాల గాలింపు చేపడుతున్నారు. మిగిలివారిని కూడా.. రాష్ట్రం దాటిపోకుండానే పట్టుకుంటామని వారు తెలియజేశారు.

ఆయన ఒక్క మాటనే.. అందరి మనసులనూ.. టచ్‌ చేసింది. ప్రజలందరికీ చాలా దగ్గరగా అయిపోయారు లలితా జ్యులెలరీ ఎండీ కిరణ్. బుధవారం జరిగిన చోరీలో ఆ సన్నివేశాలు.. అచ్చం హాలీవుడ్ మూవీని తలిపించాయి. షాపులో ఎటు చూసినా.. కెమెరాలే ఉండటంతో.. దొంగలు.. చాకచక్యంగా వ్యవహరించారు. మొఖానికి మాస్క్‌ ధరించి.. కేవలం కళ్లు మాత్రమే కనపడేలా జాగ్రత్తపడ్డారు. అంతేకాదు.. చేతులకు గ్లౌజులు కూడా ధరించారు. దుకాణం వెనుక భాగంలో షెటర్లు కట్‌చేసి లోపలికి ప్రవేశించారు. తరువాత గోడకు కన్నం వేసి.. రూ.13 కోట్ల విలువ చేసే బంగారు నగలు, వజ్రాలను ఎత్తుకెళ్లారు.