గాజులదిన్నెకు పొంచి ఉన్న ప్రమాదం.. ప్రాజెక్టుకు లీకేజీలు.. ఆందోళన చెందుతున్న కర్నూలు జిల్లా ప్రజలు

కర్నూలుజిల్లాలో అతి ప్రధానమైన ప్రాజెక్టులలో ఒకటైన గాజులదిన్నె ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. గత పది రోజులుగా ప్రాజెక్ట్ నుంచి లీకేజీల...

గాజులదిన్నెకు పొంచి ఉన్న ప్రమాదం.. ప్రాజెక్టుకు లీకేజీలు.. ఆందోళన చెందుతున్న కర్నూలు జిల్లా ప్రజలు

Edited By: Sanjay Kasula

Updated on: Dec 11, 2020 | 6:30 AM

కర్నూలుజిల్లాలో అతి ప్రధానమైన ప్రాజెక్టులలో ఒకటైన గాజులదిన్నె ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. గత పది రోజులుగా ప్రాజెక్ట్ నుంచి లీకేజీల రూపంలో నీరు బయటకు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదం లేదని అధికారులు వివరణ ఇస్తున్నప్పటికీ క్రస్ట్ గేట్లకు రెండువైపుల నుంచి నీరు లీకేజ్ ఎందుకు అవుతుందనేది ఈ అనుమానాలకు తావిస్తోంది. ప్రాజెక్టుకు ఏమాత్రం ఇబ్బంది జరిగినా కర్నూలు నిండా మునగాల సిందే. కాగా, కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గాజులదిన్నె దగ్గర సంజీవయ్య సాగర్ 1977 ప్రాంతంలో నిర్మాణం చేపట్టారు. ఆరు టిఎంసిల సామర్థ్యంతో నిర్మించినప్పటికీ ఎప్పుడూ కూడా ఆ స్థాయిలో నీటి నిల్వ చేయలేదు. రికార్డు స్థాయిలో ఈ ఏడాది భారీ వర్షాలు వరదలు రావడంతో ప్రాజెక్టుకు ఏకంగా 17 సార్లు గేట్లు ఎత్తారు. ఎమ్మిగనూరు కోడుమూరు పత్తికొండ డోన్ నియోజకవర్గాలకు తాగు సాగునీటిని ప్రాజెక్టు అందిస్తోంది. మొదటిసారిగా అత్యధిక నీటి నిల్వ చేయడంతో పాటు వరదలు వరసగా వస్తుండడంతో ప్రాజెక్టు ఆనకట్ట తడిసి ముద్దయింది. దీనికితోడు కరెక్ట్ గేట్ల నిర్వహణ ఏమాత్రం మెయింటెన్ చేయడం లేదు. ఆనకట్ట కూడా బలహీన పడుతున్న దని చర్చ ఇంజనీరింగ్ అధికారులు జరుగుతోంది. క్రస్ట్ గేట్లకు రెండువైపులా ఆనకట్ట నుంచి గత పది రోజులుగా నీరు లీక్ అవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నాలుగున్నర టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఏ మాత్రం హాని జరిగినా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుందని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.