కర్నూలు జిల్లా ఓర్వకల్లు లో నిర్మాణంలో ఉన్న కర్నూలు ఎయిర్ పోర్టు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పరిశీలించారు. నిర్మాణ పనులను, పురోగతిని సమీక్షించారు. విమానాశ్రయ పనులు దాదాపు పూర్తి అయినందున సివిల్ ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వగానే విమానాల రాకపోకలు జరిగే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. సివిల్ ఏవియేషన్ అనుమతులు ఏ క్షణమైన రావచ్చని కలెక్టర్ వీరపాండ్య అధికారులకు సూచించారు.