KTR: కేటీఆర్ సీఎం అయితే మరింత అభివృద్ధి… చాలా మంది ఎమ్మెల్యేల అభిప్రాయం ఇదే’.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరంటే..
KTR Next CM: గతకొన్ని రోజులుగా కేటీఆర్ ముఖ్యమంత్రి కానున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించనున్నారని చర్చలు జరుగుతోన్న వేళ నిజమాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే..
KTR Next CM: గతకొన్ని రోజులుగా కేటీఆర్ ముఖ్యమంత్రి కానున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించనున్నారని చర్చలు జరుగుతోన్న వేళ నిజమాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ తన మనసులోని మాట బయటపెట్టారు. ఇందూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేటీఆర్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ సమర్థుడు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటీఆర్ అధ్యక్షతన జరగాలని కోరుకుంటున్నాను. యువనేత కేటీఆర్‌ను సీఎం చేయాలని మేమంతా ఆశిస్తున్నాం. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేటీఆర్ సీఎం అయ్యేలా ఆశీర్వదించాలి. ఇది కేవలం నా ఒక్క అభిప్రాయమే కాదు.. చాలా మంది యువ ఎమ్మెల్యేలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇక కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలనుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజి రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్న వారిలో తానూ ఒకడినని చెప్పుకొచ్చారు. ఈ విషయమై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆలోచించి.. కేటీఆర్‌ను సీఎం చేయాలని ఎమ్మెల్యే చెప్పారు.