తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. గల్లీలు, కాలనీల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా సభ్యత్వాలను నమోదు చేస్తున్నారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటుకు బాధ్యులుగా 69 మందిని నియమించారు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్. వీరంతా రాష్ట్రవాప్తంగా 119 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదును పర్యవేక్షిస్తున్నారు.
కోటి సభ్యత్వాల నమోదు టార్గెట్‌గా టీఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. సభ్యత్వ నమెదు పూర్తయిన తర్వాత బూత్ కమిటీ, డివిజన్ కమిటీలు నియమిస్తారు. ఆతర్వాత జిల్లా కార్యవర్గాన్ని కూడా ఎంపికచేస్తారు. ఇక ఇదే అంశాలపై చర్చించేందుకు పార్టీ ఇంఛార్జ్‌లతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు.