KTR Global Governance: మరో అంతర్జాతీయ సదస్సులో పాల్గొననున్న కేటీఆర్‌.. ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు నుంచి ఆహ్వానం..

KTR Global Technology Governance: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మరో అంతర్జాతీయ సదస్సులో పాల్గొననున్నారు...

KTR Global Governance: మరో అంతర్జాతీయ సదస్సులో పాల్గొననున్న కేటీఆర్‌.. ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు నుంచి ఆహ్వానం..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 06, 2021 | 7:54 AM

KTR Global Technology Governance: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మరో అంతర్జాతీయ సదస్సులో పాల్గొననున్నారు. ఏప్రిల్‌ 5 నుంచి 7 వరకు జపాన్‌ రాజధాని టోక్యోలో జరగనున్న ప్రపంచ సాంకేతిక పరిపాలన (గ్లోబర్‌ టెక్నాలజీ గవర్నెన్స్) సదస్సు – 2021కు హాజరుకావాలని కేటీఆర్‌కు ఆహ్వానం అందింది.

ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహిస్తున్న ఈ సదస్సుకు హాజరుకావాలని కోరుతూ ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు బోర్గ్‌ బ్రండే కేటీఆర్‌కు మంగళవారం లేఖ రాశారు. ఈ లేఖలో బోర్గ్‌ పలు విషయాలను ప్రస్తావిస్తూ.. కరోనా సంక్షోభం అనంతరం ప్రపంచ దేశాలు తిరిగి అభివృద్ధి పథంలో నడిచేందుకు కొత్త టెక్నాలజీ వినియోగం, నాలుగో పారిశ్రామిక విప్లవంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం, సాంకేతిక పరిమితులు, నూతన ఆవిష్కరణలు తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తామని బోర్గ్‌ తెలిపారు. ఇక తెలంగాణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ.. సామాజిక లబ్ధి కోసం వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నారని బోర్గ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ సదస్సుకు ఆహ్వానం అందడం పట్ల స్పందించిన మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఇది తెలంగాణకు లభించిన మరో గుర్తింపు అని చెప్పుకొచ్చారు. ఈ సదస్సులో పాల్గొని నూతన టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ సాధించిన పురోగతిని ప్రపంచ దేశాలకు తెలియజేస్తామని చెప్పుకొచ్చారు.

Also Read: Murder in Sangareddy: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. భూ వివాదంలో కత్తులతో దాడి.. ఒకరు మృతి

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..