ఇరు రాష్ట్రాలకు కృష్ణా నీటి పంపకాలు ఖరారు..!

| Edited By:

Aug 05, 2020 | 7:11 PM

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులను చేపట్టాలంటే కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు పూర్తి నివేదికను సమర్పించాల్సిందేనని బోర్డు స్పష్టం చేసింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమకు మళ్లించేందుకు

ఇరు రాష్ట్రాలకు కృష్ణా నీటి పంపకాలు ఖరారు..!
Follow us on

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులను చేపట్టాలంటే కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు పూర్తి నివేదికను సమర్పించాల్సిందేనని బోర్డు స్పష్టం చేసింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమకు మళ్లించేందుకు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల విషయంలో.. తక్షణమే టెండర్లు ఆపేయాలని.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి వచ్చే వరకు ముందుకెళ్లవద్దని లేఖలో స్పష్టం చేసింది. ఏపీ సర్కార్ చేపట్టిన ఈ పథకం వల్ల దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో రెండు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు కృష్ణ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణ నీటి పంపకాలు చేపట్టింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణ వాటాగా 37.672 టీఎంసీలుగా, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి ఆంధ్ర ప్రదేశ్ వాటాగా 17 టీఎంసీలుగా నిర్ణయించింది.

Read More:

మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా.. అయోధ్య..!

గుడ్ న్యూస్: 1167 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్