Vijayawada: కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ వివాహం.. మచిలీపట్నం కలెక్టరేట్ చాంబర్‌లోనే..

Vijayawada: కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్, రాజస్థాన్‌కు చెందిన దేవేంద్ర కుమార్‌ను అపరాజిత సింగ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రస్తుతం దేవేంద్ర కుమార్ హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణలో ఉన్నారు. వీరిద్దరు మచిలీపట్నం కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లోనే పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరిది రాజస్థాన్ రాష్ట్రం. కొత్త జంటకు జిల్లా కలెక్టర్, ఇతర ఉద్యోగులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. పెళ్లి తర్వాత ఇద్దరు శ్రీకొండాలమ్మ గుడికి వెళ్లారు. యువ ఐఏఎస్ అధికారిణి ట్రైనీ ఐపీఎస్‌లు వివాహ బంధంతో..

Vijayawada: కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ వివాహం.. మచిలీపట్నం కలెక్టరేట్ చాంబర్‌లోనే..
Aparajitha Kumar And Joint Collector Aparajitha Singh

Edited By:

Updated on: Aug 09, 2023 | 2:37 PM

విజయవాడ న్యూస్, ఆగస్టు 9: కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌కు చెందిన దేవేంద్ర కుమార్‌ను అపరాజిత సింగ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రస్తుతం దేవేంద్ర కుమార్ హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణలో ఉన్నారు. వీరిద్దరు మచిలీపట్నం కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లోనే పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరిది రాజస్థాన్ రాష్ట్రం. కొత్త జంటకు జిల్లా కలెక్టర్, ఇతర ఉద్యోగులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. పెళ్లి తర్వాత ఇద్దరు శ్రీకొండాలమ్మ గుడికి వెళ్లారు.

యువ ఐఏఎస్ అధికారిణి ట్రైనీ ఐపీఎస్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కృష్ణా జిల్లాలో ఈ జంట వివాహం నిరాడంబరంగా జరిగింది. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్, ట్రైనీ ఐపీస్ అధికారి దేవేంద్ర కుమార్‌లు మచిలీపట్నం కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో జిల్లా రిజిస్ట్రార్‌ సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. దండలు మార్చుకుని రిజిస్టర్ మ్యారేజ్‌తో ఒక్కటయ్యారు. కొత్త జంటకు కలెక్టర్ రాజాబాబు, కలెక్టరేట్ సిబ్బంది అభినందనలు తెలిపారు

వివాహం అనంతరం నూతన దంపతులు గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని శ్రీకొండాలమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. రాజస్థాన్‌కు చెందిన దేవేంద్రకుమార్ హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణలో ఉన్నారు. అపరాజిత సింగ్‌ది కూడా రాజస్థాన్‌ కాగా.. ఏపీ కేడర్ ఐఏఎస్‌ అధికారిణిగా ఉన్నారు.. ఆమె ప్రస్తుతం కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఏపీ కేడర్‌కు చెందిన మరో యువ ఐఏఎస్‌ల జంట వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, శ్రీకాకుళం జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌కుమార్‌ల వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారి పెళ్లి వేడుక తిరుపతిలో జరగ్గా.. బంధు మిత్రులు, వివిధ శాఖల అధికారులు హాజర్యారు. నాగలక్ష్మి 2012 ఐఏఎస్‌ బ్యాచ్‌ ఐఏఎస్.. నవీన్‌కుమార్‌ 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌ ఐఏఎస్ అధికారి. నవీన్‌కుమార్‌ ప్రస్తుతం జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..