టీడీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుంది- కోటంరెడ్డి

|

Apr 15, 2019 | 12:29 PM

నెల్లూరు: తనపై టీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. తాను టీడీపీ నేతలను ఎప్పుడూ బెదిరించలేదని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రౌడీయిజాన్ని తానెప్పుడు ప్రోత్సహించలేదని అన్నారు.  ఓటమి భయంతోనే టీడీపీ నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.  టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుడు తిరుమల నాయుడుతో తనకు ఎటువంటి శత్రుత్వం లేదని పేర్కొన్నారు. తిరుమల నాయుడుపై దాడి జరిగిన వెంటనే టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద […]

టీడీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుంది- కోటంరెడ్డి
Follow us on

నెల్లూరు: తనపై టీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. తాను టీడీపీ నేతలను ఎప్పుడూ బెదిరించలేదని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రౌడీయిజాన్ని తానెప్పుడు ప్రోత్సహించలేదని అన్నారు.  ఓటమి భయంతోనే టీడీపీ నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.  టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుడు తిరుమల నాయుడుతో తనకు ఎటువంటి శత్రుత్వం లేదని పేర్కొన్నారు. తిరుమల నాయుడుపై దాడి జరిగిన వెంటనే టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర తనపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తనపై దాడికి యత్నించడం మంచి పద్దతి కాదని సూచించారు.