పార్టీని మ‌రింత ప‌టిష్టం చేయండి..ముగ్గురు నేతలకు సీఎం కీలక బాధ్యతలు

వైసీపీని సంస్థాగతంగా మరింతపటిష్టం చేసేందుకు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోక‌స్ పెట్టారు. ఈ నేప‌థ్యంలో పార్టీలో ముగ్గురు సీనియర్‌ నేతలకు జ‌గ‌న్ కీలక బాధ్యతలు అప్పగించారు.

పార్టీని మ‌రింత ప‌టిష్టం చేయండి..ముగ్గురు నేతలకు సీఎం కీలక బాధ్యతలు
YSRCP

Updated on: Jul 01, 2020 | 10:40 PM

వైసీపీని సంస్థాగతంగా మరింతపటిష్టం చేసేందుకు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోక‌స్ పెట్టారు. ఈ నేప‌థ్యంలో పార్టీలో ముగ్గురు సీనియర్‌ నేతలకు జ‌గ‌న్ కీలక బాధ్యతలు అప్పగించారు. జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డిలకు బాధ్యతలు అప్పగిస్తూ వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం పత్రికా ప్రకటన రీలీజ్ చేసింది.

వైవీ సుబ్బారెడ్డికి.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల బాధ్యతలు… విజయసాయిరెడ్డికి.. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల‌తో పాటు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతలను… సజ్జల రామకృష్ణారెడ్డికి.. నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, వైఎస్సాఆర్ క‌డ‌ప‌‌ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఇక‌ తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డి చూడాల్సిందిగా జ‌గ‌న్ నిర్ణ‌యించారు.