పొరుగు రాష్ట్రాలతో స్నేహ బంధాన్ని కొనసాగిస్తాం: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సుదీర్ఘ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్‌ మీడియాకు వెల్లడించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కొనసాగించాల్సిన సంబంధాలు.. రాబట్టాల్సిన ఫలితాలు.. అంశాలపై కేబినెట్‌లో విస్తృతంగా చర్చించినట్టు సీఎం వెల్లడించారు. ఏపీతో చాలా స్నేహపూర్వకమైన, ప్రేమపూర్వకమైన, ఉల్లాసభరితమైన సంబంధాన్ని కొనసాగించాలని కేబినెట్‌ స్పష్టమైన అవగాహనతో కూడిన నిర్ణయానికి వచ్చిందన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలతో […]

పొరుగు రాష్ట్రాలతో స్నేహ బంధాన్ని కొనసాగిస్తాం: కేసీఆర్‌

Updated on: Jun 18, 2019 | 9:23 PM

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సుదీర్ఘ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్‌ మీడియాకు వెల్లడించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కొనసాగించాల్సిన సంబంధాలు.. రాబట్టాల్సిన ఫలితాలు.. అంశాలపై కేబినెట్‌లో విస్తృతంగా చర్చించినట్టు సీఎం వెల్లడించారు. ఏపీతో చాలా స్నేహపూర్వకమైన, ప్రేమపూర్వకమైన, ఉల్లాసభరితమైన సంబంధాన్ని కొనసాగించాలని కేబినెట్‌ స్పష్టమైన అవగాహనతో కూడిన నిర్ణయానికి వచ్చిందన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలతో తెలుగు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఏర్పడిందన్నారు. గతంలో కర్ణాటక, మహారాష్ట్రతో నిత్యం నీటి తగాదాలే ఉండేవని..ఇప్పడు సత్సంబంధాలు  కొనసాగిస్తున్నామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికావొచ్చిందని,  ప్రాజెక్టులోని కొన్ని రిజర్వాయర్లు పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. కాళేశ్వరం పూర్తికావడానికి మహారాష్ట్ర పూర్తిగా సహకరించిందని పేర్కొన్నారు.

కేబినెట్ భేటీలోని కీలక అంశాలు

నూతన సెక్రటేరియట్, నూతన అసెంబ్లీ భవనాల, నూతన విధాన సౌధ నిర్మాణానికి కేబినేట్ నిర్ణయం
పార్లమెంటు భవనం తరహాలో ఎర్రమంజిల్ ప్రాంతంలో నూతన అసెంబ్లీ, కౌన్సిల్ భవనాల నిర్మాణంప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సు, పీఆర్సీ పెంపుపై ఉద్యోగ సంఘాలతో చర్చలు
మోకిలా ప్రాంతంలో ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ కు సినిమా స్టూడియో నిర్మాణానికి 5 ఎకరాల కేటాయింపుశారదాపీఠానికి 2 ఎకరాల కేటాయింపు
టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల నిర్మాణానికి 31 జిల్లాల్లో భూముల కేటాయింపునూతన సెక్రటేరియట్, నూతన అసెంబ్లీ భవనాల, నూతన విధాన సౌధ నిర్మాణానికి కేబినేట్ నిర్ణయం
పార్లమెంటు భవనం తరహాలో ఎర్రమంజిల్ ప్రాంతంలో నూతన అసెంబ్లీ, కౌన్సిల్ భవనాల నిర్మాణం