చిక్కుల్లో కేశినేని.. జీతాలెక్కడ అంటున్న కార్మికులు..
కేశినేని ట్రావెల్స్ వ్యవహారం ఇంకా చల్లారలేదు. ట్రావెల్స్‌లో పనిచేసిన కార్మికులు విజయవాడలో నిరసన దీక్షకు దిగారు. తమకు యాజమాన్యం జీతాలు ఎగ్గొట్టినట్లు ఆరోపిస్తున్నారు. కేశినేని ట్రావెల్స్ మూసేసి ఇన్ని రోజులైనా.. జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన బాట పట్టారు. తమకు ఎగ్గొట్టిన జీతాలు వెంటనే చెల్లించాలంటూ విజయవాడ లెనిన్ సెంటర్‌లో బాధితులు ధర్నాకు దిగారు. గతంలో కూడా ఉద్యోగులు కేశినేని ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. అన్యూహ్య నిర్ణయంతో కేశినేని ట్రావెల్స్ మూసివేయడంతో ఆ సంస్థ ఉద్యోగులు రోడ్డున […]
కేశినేని ట్రావెల్స్ వ్యవహారం ఇంకా చల్లారలేదు. ట్రావెల్స్‌లో పనిచేసిన కార్మికులు విజయవాడలో నిరసన దీక్షకు దిగారు. తమకు యాజమాన్యం జీతాలు ఎగ్గొట్టినట్లు ఆరోపిస్తున్నారు. కేశినేని ట్రావెల్స్ మూసేసి ఇన్ని రోజులైనా.. జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన బాట పట్టారు. తమకు ఎగ్గొట్టిన జీతాలు వెంటనే చెల్లించాలంటూ విజయవాడ లెనిన్ సెంటర్‌లో బాధితులు ధర్నాకు దిగారు. గతంలో కూడా ఉద్యోగులు కేశినేని ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. అన్యూహ్య నిర్ణయంతో కేశినేని ట్రావెల్స్ మూసివేయడంతో ఆ సంస్థ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఉన్నఫలంగా ఉద్యోగాలు ఊడిపోవడంతో పాటు జీతాలు కూడా చెల్లించకపోవడంతో కేసినేని కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. బకాయిపడ్డ వేతనాలు చెల్లించాలని ఆందోళనలు చేశారు. చెన్నై, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ తదితర ప్రాంతాల్లోని కేసినేని ఆఫీస్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగినా.. మళ్లీ ఇప్పుడు మొదటికొచ్చింది. తక్షణమే జీతాలు చెల్లించాలంటూ కార్మికులు లెనిన్ సెంటర్‌లో నిరసనకు దిగారు. తమకు యాజమాన్యం నెలల తరబడి జీతాలు ఎగ్గొట్టినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జీతాలు చెల్లించకపోతే ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.