ఇద్దరు సీఎంలు కలిశారు.. నిర్ణయం ఒక సంచలనం !

|

Sep 25, 2019 | 7:24 PM

పరంబికుళం-అలియార్ నీటి భాగస్వామ్య ఒప్పందాన్ని సమీక్షించడానికి కేరళ, తమిళనాడు రాష్ట్రాలు అంగీకరించాయి. కొత్త ఒప్పందాన్ని రూపొందించడానికి, ఇతర అంతర్-రాష్ట్ర నీటి భాగస్వామ్య సమస్యలను పరిష్కరించడానికి రెండు రాష్ట్రాలు కార్యదర్శి-స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నాయి. తిరువనంతపురంలో బుధవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామిల మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి కమిటీలో సాంకేతిక నిపుణులతో సహా ఐదుగురు సభ్యులు ఉంటారు. ప్యానెల్ సభ్యుల వివరాలు, మొదటి సమావేశ వేదికను […]

ఇద్దరు సీఎంలు కలిశారు.. నిర్ణయం ఒక సంచలనం !
Follow us on

పరంబికుళం-అలియార్ నీటి భాగస్వామ్య ఒప్పందాన్ని సమీక్షించడానికి కేరళ, తమిళనాడు రాష్ట్రాలు అంగీకరించాయి. కొత్త ఒప్పందాన్ని రూపొందించడానికి, ఇతర అంతర్-రాష్ట్ర నీటి భాగస్వామ్య సమస్యలను పరిష్కరించడానికి రెండు రాష్ట్రాలు కార్యదర్శి-స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నాయి. తిరువనంతపురంలో బుధవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామిల మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి కమిటీలో సాంకేతిక నిపుణులతో సహా ఐదుగురు సభ్యులు ఉంటారు. ప్యానెల్ సభ్యుల వివరాలు, మొదటి సమావేశ వేదికను ఇంకో వారంలో ప్రకటించనున్నారు. అనామలయార్ మళ్లింపు, నీలార్-నెల్లార్ మళ్లింపుపై కూడా ఈ కమిటీ చర్చించనుంది.