ఫ్రంట్ వారియర్స్ కోసం కేరళ సర్కార్ కీలక నిర్ణయం

|

Jun 24, 2020 | 7:56 PM

వైద్య సిబ్బందికి గుడ్ న్యూస్ తీసుకువచ్చింది కేరళ ప్రభుత్వం. కోవిడ్ కేర్‌లో పని చేసే ఉద్యోగులకు త్రీ టైర్ పూల్ సిస్టమ్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. కోవిడ్ పై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బందికి విధుల్లో వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఫ్రంట్ వారియర్స్ కోసం కేరళ సర్కార్ కీలక నిర్ణయం
Follow us on

కరోనావైరస్‌ మహమ్మారిని నియంత్రించటానికి పోరాడుతున్న వైద్య సిబ్బందికి గుడ్ న్యూస్ తీసుకువచ్చింది కేరళ ప్రభుత్వం. కోవిడ్ కేర్‌లో పని చేసే ఉద్యోగులకు త్రీ టైర్ పూల్ సిస్టమ్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. కోవిడ్ పై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బందికి విధుల్లో వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా బాధితులకు చికిత్స చేయడంలో తమ ప్రాణాలు గాలిలో దీపాలయ్యాయని వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది భయపడుతున్నారు. రోగులు, సహోద్యోగులు, కుటుంబాలతో ఈ వైద్య సిబ్బంది సంబంధాలను కూడా ఈ మహమ్మారి మార్చేసింది. ఈ సంక్షోభ పరిస్థితుల్లో చాలా మంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో కేరళ ప్రభుత్వం వారికి ఉపశమనం కల్పించేందుకు త్రీ టైర్ పూల్ సిస్టమ్‌ అమలు చేయాలని నిర్ణయించింది.

హెల్త్‌కేర్ రంగంలో పని చేసేవారిని మూడు విభాగాలుగా విభజించారు. కోవిడ్ పూల్, ఆఫ్-డ్యూటీ పూల్, రొటీన్ పూల్ అని విభజిస్తారు. మొదట కోవిడ్ పూల్‌లో ఉన్నవారు మొదటి 10 రోజులు విధుల్లో ఉంటారు. అనంతరం వారు ఆఫ్-డ్యూటీ పూల్‌లోకి వెళ్తారు. మరో 10 రోజుల తర్వాత రొటీన్ పూల్‌లోకి వస్తారు. మరో 10 రోజుల తర్వాత తిరిగి కోవిడ్ పూల్‌కు వస్తారు. అంటే పదిరోజులు విధుల అనంతరం పది రోజులు రెస్ట్ లో ఉంటారని అధికారులు తెలిపారు. మూడు షిప్టుల్లో 8 గంటలపాటు విధుల్లో ఉండాల్సి ఉంటుంది. అయితే 4 గంటల పాటు మాత్రమే పీపీఈ కిట్లను ఉపయోగించుకునేలా అవకాశం కల్పించారు.

డాక్టర్లు, నర్సులు, స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులు, నర్సింగ్ సూపరింటెండెంట్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ అసిస్టెంట్లు, హాస్పిటల్ అటెండెంట్లు, డ్రైవర్లు, ఇతరులు ఈ త్రీ టైర్ పూల్ సిస్టమ్‌‌లోకి వస్తారని అధికారులు వెల్లడించారు. ఇక ప్రతి జిల్లాలో 15 మంది సభ్యులతో కూడిన ఎమర్జెన్సీ రిలీవర్ టీమ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.