కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌పై విపక్షాల ఆందోళనలు

కేరళలో గోల్డ్‌ స్మగ్లింగ్ కేసు ప్రకంపనలు రేపుతోంది. విపక్షాలు ఆందోళనలను మరింత ఉధృతం చేశాయి. త్రివేండ్రంలో సెక్రటేరియట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించాయి యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు...

కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌పై విపక్షాల ఆందోళనలు

Updated on: Sep 17, 2020 | 3:25 PM

కేరళలో గోల్డ్‌ స్మగ్లింగ్ కేసు ప్రకంపనలు రేపుతోంది. విపక్షాలు ఆందోళనలను మరింత ఉధృతం చేశాయి. త్రివేండ్రంలో సెక్రటేరియట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించాయి యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు. ఈ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొన్న మంత్రి జలీల్‌ రాజీనామా చేయాలంటూ ఆందోళన చేపట్టారు. బారికేడ్లను తొలగించడానికి యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసులకు , ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు . భాష్పవాయువును ప్రయోగించారు. వాటర్‌ కెనాన్లను కూడా ఉపయోగించారు. వందలాదిమంది యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.

మరో వైపు విద్యార్థి సంఘాలు జిల్లాల వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. వినూత్న తరహాలో కార్యక్రమాలను చేపడుతున్నారు.