కీసర మాజీ తహసీల్దార్ కేసులో బెయిల్ విచారణ వాయిదా

|

Aug 28, 2020 | 5:43 PM

కీసర మాజీ తహసీల్దార్ కేసులో బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఇప్పటికే నలుగురు నిందితులు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

కీసర మాజీ తహసీల్దార్ కేసులో బెయిల్ విచారణ వాయిదా
Follow us on

కీసర మాజీ తహసీల్దార్ కేసులో బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఇప్పటికే నలుగురు నిందితులు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి ఏసీబీ అధికారులు సమయం కోరారు. దీంతో ఏసీబీ కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం నాడు ఈ బెయిల్ పిటిషన్లపై కోర్టులో విచారణ జరగనుంది.

అయితే, కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన మూడు రోజుల కస్టడీ గడువు గురువారంతో ముగిసింది. నాగరాజు, అంజిరెడ్డి, శ్రీనాథ్‌, వీఆర్‌ఏను 3 రోజులు ఏసీబీ అధికారులు విచారించారు. చివరి రోజు కస్టడీలో నిందితుల నుంచి మరిన్ని వివరాలను ఏసీబీ అధికారులు రాబట్టినట్లు సమాచారం. అయితే, విచారణ ఎలాంటి వివరాలు చెప్పేందుకు శ్రీనాథ్‌, అంజిరెడ్డి విచారణకు సహకరించలేదని తెలుస్తోంది. నలుగుర్ని వేర్వేరుగా విచారించిన ఏసీబీ అధికారులు ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరణ చేశారు. నాగరాజు అవినీతి కేసులో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు సేకరించిన ఆధారాలు, కస్టడీలో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు కీసర జిల్లాకు చెందిన మరికొందరు రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.