కీసర తహసీల్దార్ నాగరాజు లంచం కేసులో లేటెస్ట్ అప్‌డేట్

|

Aug 19, 2020 | 6:40 PM

లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన‌ కీసర తహసీల్దార్ నాగరాజు అవినీతి కేసులో ఏసీబీ కస్టడీ పిటీషన్ వేసింది.

కీసర తహసీల్దార్ నాగరాజు లంచం కేసులో లేటెస్ట్ అప్‌డేట్
Follow us on

లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన‌ కీసర తహసీల్దార్ నాగరాజు అవినీతి కేసులో ఏసీబీ కస్టడీ పిటీషన్ వేసింది. తహసీల్దార్ నాగరాజు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంజి రెడ్డి, శ్రీనాథ్, స‌హ‌క‌రించిన‌ వీఆర్ఏను 7 రోజుల కస్టడీ కోరింది ఏసీబీ.

కాగా కోటి 10 లక్షలు లంచం తీసుకుంటూ కీసర తహసీల్దార్ నాగరాజు ఇటీవ‌ల‌ అడ్డంగా దొరికిపోయిన సంగ‌తి తెలిసిందే. కీసర మండలం రాంపల్లి దాయరలో విలువైన భూమిని వశం చేసుకుందుకు కుట్ర పన్నారు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు అంజి రెడ్డి, శ్రీనాథ్. తహసీల్దార్ నాగరాజుకు రెండు కోట్లు ఇస్తామని ఒప్పందం చేసుకుని, వాటికి సంబంధించిన భూరికార్డుల్లో పేర్లు మార్చడం, పాస్‌బుక్‌లు త‌మ పేరుతో పొందే ప్ర‌య‌త్నం చేశారు. ఈ కేసు రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌లనం రేపింది. ఈ వ్య‌వ‌హారంలో మరిన్ని వివరాలు సేకరించేందుకు నిందితుల‌ను కస్టడీకి కోరారు ఏసీబీ అధికారులు.

కాగా ఈ భూముల వ్య‌వ‌హారంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ కేసులో బుక్కైన అంజిరెడ్డి, రేవంత్ రెడ్డికి అనుచ‌రుడిగా తేలింది. అయితే అంజిరెడ్డి నివాసంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన లెట‌ర్ హెడ్స్ దొరికిన‌ట్టు సమాచారం. అవి అక్క‌డ ఎందుకు ఉన్నాయి, ఈ కేసుతో రేవంత్‌కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచార‌ణ జ‌ర‌ప‌నున్నారు.

ఈ వ్య‌వ‌హారినికి సంబంధించిన మ‌రిన్ని వివరాల కోసం దిగువ వీడియో క్లిక్ చేయండి

 


వారికి త‌క్ష‌ణ సాయంగా రూ.2 వేలు : ఏపీ స‌ర్కార్ ఉత్త‌ర్వులు

ఇసుక విధానంలో మార్పులు, మ‌రోసారి జ‌గ‌న్ మార్క్ నిర్ణ‌యాలు !

తెలంగాణ‌ పోలీస్ శాఖలో సంచ‌ల‌నం : వ‌రుస సస్పెన్ష‌న్లు