
హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పెంగ్విన్’. జూన్ 19న నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. కొడుకును కోల్పోయిన తల్లి పాత్రలో కీర్తి సురేష్ నటించగా.. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది.
Happy to launch the trailer of #Penguin .This looks very promising, intriguing and scary????
First day first show at home fix kitty @KeerthyOfficial ?https://t.co/LMhaIT0gB2 –
Telugu@EashvarKarthic @karthiksubbaraj @Music_Santhosh @KharthikD @PrimeVideoIN #PenguinTrailer— Nani (@NameisNani) June 11, 2020
థ్రిల్, సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందని చెప్పాలి. హీరో నాని ట్విట్టర్ ద్వారా ఈ ట్రైలర్‌ను విడుదల చేయగా.. ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్ నుంచి వస్తోన్న చిత్రంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానున్న ఈ సినిమాకు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా వ్యవరిస్తుండగా.. ఈశ్వర్ కార్తిక్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి లుక్కేయండి.