
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఏర్పాటైన టీఆర్ఎస్ఎల్పీ కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కొత్తగా రూపొందించిన రెవెన్యూ చట్టంతో పాటు..అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ప్రధానంగా చర్చ జరిగింది. ఇక కొత్త రెవెన్యూ చట్టాన్ని ఈ నెల 10వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. (TRSLP Meeting)
దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ.. ” అసెంబ్లీలో ఎల్లుండే కొత్త రెవిన్యూ చట్టం ప్రవేశపెడుతున్నాం. చాలా మంచి చట్టాన్ని తీసుకొస్తున్నాం. ఈ రెవెన్యూ బిల్లు అసెంబ్లీలో పాసైన రోజు ప్రతీ గ్రామంలో బాణాసంచా కాల్చాలి. అంతేకాకుండా కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి” అని అన్నారు. అంతేకాకుండా దుబ్బాకలో టీఆర్ఎస్ లక్ష మెజారిటీతో గెలుస్తుందని కేసీఆర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మళ్లీ విజయం మనదేనన్న ఆయన.. నాలుగు సర్వేలు చేయించానని.. 100 సీట్లు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.
Also Read: ఏపీ: సచివాలయాల్లో సేవా రుసుములు పెంపు.!