జమ్ముకశ్మీర్ లో ౩౩ కొత్త కరోనా కేసులు… మొత్తం 158..

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లో బుధవారం మరో 33 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో

జమ్ముకశ్మీర్ లో ౩౩ కొత్త కరోనా కేసులు... మొత్తం 158..

Edited By:

Updated on: Apr 09, 2020 | 1:59 PM

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లో బుధవారం మరో 33 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కోవిడ్ -19 మొత్తం కేసుల సంఖ్య 158 కి చేరింది. ఈ సందర్భంగా ఒక అధికారి మాట్లాడుతూ తాజాగా 33 కేసులు నమోదయ్యాయన్నారు. వీరిలో 30 మంది కాశ్మీర్ డివిజన్‌కు చెందినవారు, ముగ్గురు జమ్మూ డివిజన్‌కు చెందినవారు ఉన్నారన్నారు. కోలుకున్న తర్వాత ఇద్దరు రోగులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, ముగ్గురు రోగులు మరణించినట్లు అధికారులు తెలిపారు.