Karthika Deepam: ఆయనకి ఏమీ కాను.. అందుకనే మందులు వేసుకోనన్న దీప.. పంతం కంటే ప్రాణం ముఖ్యమని ఆలోచిస్తున్న కార్తీక్

|

Apr 13, 2021 | 8:15 AM

Karthika Deepam Serial: తెలుగు తెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కార్తీక్ దీపం సీరియల్ రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతుంది. ఈరోజు తో 1012 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టిన కార్తీక దీపం సీరియల్...

Karthika Deepam: ఆయనకి ఏమీ కాను.. అందుకనే మందులు వేసుకోనన్న దీప.. పంతం కంటే ప్రాణం ముఖ్యమని ఆలోచిస్తున్న కార్తీక్
Karthika Deepam
Follow us on

Karthika Deepam Serial: తెలుగు తెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కార్తీక్ దీపం సీరియల్ రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతుంది. ఈరోజు తో 1012 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టిన కార్తీక దీపం సీరియల్ మంచి రసపట్టు సాగుతుంది. దీప కోసం మందులు తండ్రి మురళీకృష్ణకు ఇచ్చి పంపిస్తాడు.. ఈ నేపథ్యంలో ఈరోజు సీరియల్ లోని హైలెట్స్ ఏమిటో చూద్దాం..
మురళీకృష్ణ దీప మందులు ఇస్తుంటే. ప్రశ్నించినవి ఆలోచిస్తుంటాడు. దీంతో భాగ్యం మురళీకృష్ణని వెటకారంగా అడుగుతుంది. నా బాధనాది.. నీకు ఏమి తెలుసు అంటాడు.. దీంతో అర్ధపావు పంచమని అడుగుతుంది. దీపకి మందులు ఇస్తే.. అవి అల్లుడుగారు ఇచ్చారని కనిపెట్టేసింది అని చెబుతాడు. దానికి నీకంటే తెలివి ఎక్కువ.. సరే ఇంతకీ వేసుకుందా లేదా అని ప్రశ్నిస్తుంది భాగ్యం.. రేపు నేను వెళ్లి చూస్తాను.. వేసుకోకపోతే రెండు తగిలించి మరీ వేసివస్తాను అంటుంది భాగ్యం.

సౌందర్య దీపని వెదకమని ఇచ్చిన డబ్బులో ఎంత మిగిలియాని చెబుతాడు. లక్ష 20 వేలతో రెండు బంగారం గాజులు చేయించుకుంటే అంటే.. నవ్వుతు.. మిగిలియాయి అన్నాను కానీ.. ఉన్నాయి అన్నానా అంటాడు.. అవి నిన్ననే బ్యాంక్ అకౌంట్ లో వేసినట్లు చెబుతాడు. దీంతో నీ నిజాయితీ తో ఎప్పుడు బాగుపడతాం నీకు బతకడం చేతకాదు అని అంటుంది భాగ్యం..

మరోవైపు.. మెట్లమీద నుంచి దిగుతూ.. డస్ట్ బిన్ లో ఉన్న మెడిసిన్స్ ను చూస్తాడు.. వాటిని తీసి.. మమ్మీ అంటూ పిలుస్తాడు.. అరుపులకు సౌందర్య, దీప కలిసి వస్తారు.. దీంతో మందులను డైనింగ్ టేబుల్ పైన వేసి.. ఇవేమిటి అని ప్రశ్నిస్తాడు. దీంతో సౌందర్య వాటిని చూస్తుంది. ఇవి దీప కోసం నువ్వు మురళీకృష్ణగారితో పంపించిన మందులే కదా.. అంటుంది.. అవే ఇందులో ఎందుకున్నాయి అని ప్రశ్నిస్తాడు.. అక్కడ కాదు ఇక్కడ అడుగు చెబుతాను.. రాత్రి ఏమన్నావు మమ్మీ వాళ్ళ నాన్న ఇచ్చినా తీసుకోకుండా ఇందులో పడేసింది. ఎంత పొగరు దీనికి.. అంటాడు.. సౌందర్య ఏమిటా మందులు.. ఎందుకు బలవంతం చేస్తున్నావు అంటుంది.. చెప్పారా ఏమైంది దానికి.. మాములు సుస్తీనే కదా అని ప్రశ్నలమీద ప్రశ్నిస్తుంది.. కార్తీక్ జవాబు చెప్పడానికి తడబడుతాడు.

డాక్టర్ మాలతి దీప గురించి చెప్పిన కండిషన్ గురించి గుర్తు చేసుకుంటాడు. మమ్మీ ఇది పదేళ్లనుంచి ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తూనే వస్తుంది. చాలా బలహీనంగానే ఉంది. అందుకనే ఏ పనిచేయకూడదని డాక్టర్ చెప్పింది. ఇప్పుడు ఈ మందులు వాడకపోతే.. తరువాత తర్వాత ఈ మందులు కూడా పనిచేయదు. అంతే ఏమీ లేదు అంటాడు..
అంతేనా నా గుండె ఆగిపోయినంత పనైంది.. అంటూ.. దీపని మందులు వేసుకోమని తిడుతుంది.. నువ్వు చేస్తుంది ఏమిటి.. ఎందుకు వాడి మాట వినడం లేదు.. ఎందుకు వేసుకోవడం లేదు.. ఆ మందులు ఎవరు తెచ్చారు.. అని ప్రశ్నిస్తుందిదీప .. నీ మొగుడే తెచ్చాడు.. అంటుంది సౌందర్య.

ఆ మాట నా మొగుడిని చెప్పమనండి..అత్తయ్య ఆ చెత్తలో నుంచి తీసి దులిపి మరీ వేసుకుంటా అంటుంది. దీంతో వెంటనే కార్తీక్.. వచ్చిన దగ్గర నుంచి ఇదే పాట. ట్రీట్మెంట్ కి రమ్మని అంటే రాదు.. నా మాట వినదు. పోనీ ఎవరు ఎలా పొతే అని అనుకోకపోబట్టే ఇంత లోకువ అయ్యాను.. అంటాడు కార్తీక్.. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకె మాట్లాడుకుందాం.. ఎందుకె ఈ మొండితనం.. అంటుంది సౌందర్య.

తర్వాత అంటే ఎప్పుడు అత్తయ్య.. ఇన్నేళ్ల తర్వాత.. ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చారు. .నేను మనిషిని కానా ఒక బొమ్మనా కేవలం పిల్లలకు అమ్మనా.. ఆయనకి ఏమి కానా .. ఆయనకి ఏమీ కానప్పుడు నా చావు ఏదో నేను చేస్తానని తేల్చి చెప్పఁసింది దీప.. దీప మాటలకూ కార్తీక్.. మండిపడతాడు. ఏమైతే నాకు ఎందుకు అంటే.. దీనికేమైనా తలకాయ ఉండే మాట్లాడుతుందా.. తలకాయలో ఇడ్లీలు చెట్నీలు తప్ప ఇంత గుజ్జు ఏమైనా ఉందా అంటాడు..
అసలు సంగతి తెలుసుకోకుండా తమరు వచ్చి.. రాస్తే నాలుగు సినిమాలు అంటూ తిట్టిపోసి వెళ్తావు. అసలు నేను మీ అత్తాకోడలకి ఎలా కనిపిస్తున్నాను.. ఎక్కడైనా అత్తాకోడళ్లు ఒకరినొకరుసాధిస్తుంటారు.. మీ ఇద్దరూ కలిసి సందు దొరికితే చాలు నన్ను సాధిస్తున్నారు. చూడు కనుబొమ్మ ఎత్తి ఎలా చూస్తుందో అని మండి పడతాడు కార్తీక్..

సౌందర్య.. ఇప్పుడు కూడా పట్టుదల ఎందుకు ఆరోగ్యం కంటే ఎక్కువ కాదు.. మందులు తెచ్చాడు కదా వేసుకో అని అంటుంది. దీంతో దీప తెచ్చారు నాకోసం మందులు తెచ్చారు.. మీకు కోడల్ని, పిల్లలకు ఆయమ్మని తెచ్చారు. ఆయన కోసం మాత్రం పెళ్ళాన్ని తెచ్చుకోలేదు. .ఇందులో మీరు మాట్లాడకండి అత్తయ్య.. నాకు మీ మీద చాలా కోపంగా ఉంది.. మీరు నీకు భార్య అక్కర్లేక పోవచ్చు.. నాకు కోడలు కావాలి అండంతోనే కదా నన్ను తెచ్చారు.. అయినా ఆయనకి భార్య అక్కరలేనప్పుడు.. నేను ఎలా పొతే ఆయనకి ఎందుకు
ఇంకెందుకు ఈ అనవసరమైన పంచాయితీ. నేను మందులనే చెత్తబుట్టలో పడేశాను.. మీ కొడుకు మీ పిల్లల్ని చెత్తబుట్టలో పడేశాడు. ఒకవేళ ఏమైనా అనదల్చుకుంటే అక్కడ అనండి అంటుంది దీప..

దీప అక్కర్లేదు.. నాకు ఎవరూ చెప్పక్కర్లేదు.. నేను పదేళ్ల నుంచి చెబుతూనే ఉన్నాను.. ఇంకా నా సంస్కరం వదులుకునే మాటలు నేను మాట్లాడాను.. ఎవరిష్టం వచ్చినట్లు ఉండండి.. అత్తగారికి కోడలు అప్ప చెప్పాను.. మీకోడాలని మీరు కొట్టి చెప్పుకుంటారో.. తిట్టి చెప్పుకుంటారో అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో దీప కళ్ళు తిరిగి పడిపోతుంది.. అప్పుడు అత్తగారు పట్టుకుంటుంది. దీంతో కార్తీక్ కంగారుగా దీప దగ్గరకి వస్తాడు. దీపని తీసుకుని రూమ్ కి వెళ్తాడు. నువ్వు దానిని బాధపెట్టకురా పెద్దోడా నీకు దణ్ణం పెడతా నిదానంగా నేనే దానికి నచ్చచెబుతా అంటుంది సౌందర్య..

ఇక మోనిత తో ప్రియమణి మాట్లాడుతూ.. నెయిల్ పాలిష్ వేసుకోమని అంటుంది.. వద్దు ఏ వాసన పడడంలేదు.. కార్తీక్ నేను చదువుకునే సమయం నుంచి తెలుసు.. కార్తీక్ అంటే నాకు ప్రాణం.. నా ఆశ ద్యాస. శ్వాస.. అప్పుడు మీ ప్రేమ చెప్పలేదా అని అంటుంది.. ప్రియమణి.. ఆలస్యం అయ్యింది.. నేను అమెరికా వెళ్ళినప్పుడు కార్తీక్ దీపని పెళ్లి చేసుకున్నాడు.. అంటుంది మోనిత.. కార్తీక్ అయ్యని నేను తలచుకుంటున్నా.. అసలు మీరు ఆ పేరు ఎత్తడం లేదు అంటుంది ప్రియమణి. ఇప్పుడు నేను కార్తీక్ ని తలచుకొనవసరం లేదు. ఎప్పుడు నా పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది. అని మోనిత నవ్వుతుంది.

మరోవైపు దీప ఆరోగ్యం గురించి డాక్టర్ చెప్పింది గుర్తు చేసుకుంటాడు.. ఏమి చెయ్యాలి నేను.. ఎంతైనా అది నా భార్య.. ప్రాణాలు పోతూ ఉంటె చూస్తూ ఉండాలా.. ఏమి చేయాలి నేను. .ప్రాణం ముఖ్యంగా పట్టుదల ముఖ్యమా.. ఏది ముఖ్యం అని ఆలోచిస్తుంటాడు
దీప దగ్గర అత్తగారు పిల్లలు ఆతృతగా ఎదురుచూస్తారు. ఎందుకు ఇంత నీరసంగా తయారు అయ్యావు.. లేదు ఊరినుంచి వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తున్న నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు.. వాడి మీద కోపం ఉంటె వదిలెయ్యి.. నేను నిన్ను మంచి హాస్పటల్ కి తీసుకెళ్తా.. ఏమైంది దీప. నాతో కూడా చెప్పవా అంటుంది సౌందర్య.

దీంతో శౌర్య కలుగజేసుకుని .. దీప ఆరోగ్యం గురించి చెబుతుంది. హిమ .. నాన్న పెద్ద డాక్టర్ కదా.. ఎందుకు ఆస్పత్రికి తీసుకుని వెళ్ళడు. అమ్మంటే నాన్న కు ఇంకా ఇష్టం లేదా అని అంటుంది. దీపని పెద్ద హాస్పటల్ కి తీసుకుని వెళ్తే అప్పుడే నయం అంటుంది అంటుంది శౌర్య. ఇంతలో కార్తీక్ దీప ఉన్న రూమ్ కి వస్తాడు.. సౌందర్య పిల్లలిద్దరినీ తీసుకుని బయటకు వెళ్తుంది. కార్తీక్ దీప దగ్గర కూర్చుని .. పడుకో అని అంటాడు పిల్లలు కూడా నన్ను అపార్ధం చేసుకున్నారు.. నీకు బాగోలేకపోతే నేను పట్టించుకోవడం లేదు అనుకుంటున్నారు. ఎందుకు వాళ్ళముందు నన్ను కర్కోటకుడిగా మారుస్తున్నావు అని అంటాడు దీపతో..

 

Also Read: ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారో తెలుసా.. విష్ణు సహస్రం కలిగిస్తే ఫలితం ఏమిటంటే..!

ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారో తెలుసా.. విష్ణు సహస్రం కలిగిస్తే ఫలితం ఏమిటంటే..!