కర్ణాటకలో కరోనా కల్లోలం.. 6 వేలకు చేరువైన కేసులు..

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. ఈ క్రమంలో కర్ణాటకలో కరోనా కేసులు 6వేలకు చేరువయ్యాయి. 60మందికి పైగా మరణించారు.

కర్ణాటకలో కరోనా కల్లోలం.. 6 వేలకు చేరువైన కేసులు..

Edited By:

Updated on: Jun 09, 2020 | 10:40 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. ఈ క్రమంలో కర్ణాటకలో కరోనా కేసులు 6వేలకు చేరువయ్యాయి. 60మందికి పైగా మరణించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. గత 24 గంట్లలో రాష్ట్ర వ్యాప్తంగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇద్దరు మరణించారని తెలిపింది. 164 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయ్యారని వివరించింది.

కాగా.. తాజాగా రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 5,921కి చేరాయని, వారిలో 3,248 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 2,605మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యరని వెల్లడించింది. అయితే 66 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.

Also Read: కరోనా వైరస్ లక్షణాలు లేనివారితో.. సంక్రమణం అరుదు..: ప్రపంచ ఆరోగ్య సంస్థ