భార్యకు ప్రేమతో.. నిలువెత్తు మైనపు విగ్రహం..

భార్యకు ప్రేమతో.. నిలువెత్తు మైనపు విగ్రహం..

మరణం.. మనుషులను దూరం చేస్తుంది గానీ.. మనసులను కాదని ఈ సంఘటన చూస్తే మీకే అర్ధమవుతుంది. తనను విడిచి పరలోకాలకు వెళ్ళిపోయిన భార్యపై తనకున్న ఎనలేని ప్రేమను చాటుకున్నాడు ఓ వ్యక్తి.

Ravi Kiran

|

Aug 11, 2020 | 7:46 AM

Man Makes Wax Statue For His Wife: మరణం.. మనుషులను దూరం చేస్తుంది గానీ.. మనసులను కాదని ఈ సంఘటన చూస్తే మీకే అర్ధమవుతుంది. తనను విడిచి పరలోకాలకు వెళ్ళిపోయిన భార్యపై తనకున్న ఎనలేని ప్రేమను చాటుకున్నాడు ఓ వ్యక్తి. ఆమె మధురస్మృతులు ఎప్పటికీ తనతోనే ఉండాలనే ఉద్దేశంతో భార్యకు ఏకంగా నిలువెత్తు మైనపు విగ్రహమే తయారు చేయించాడు. ఇదే కదా ప్రేమంటే అనిపించేలా ఆ స్టోరీ ఏంటంటే…

కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా భార్య కొన్నేళ్ళ క్రిందట ఓ రోడ్డు యాక్సిడెంట్‌లో మరణించారు. చావు మనిషినే కానీ.. మనసులను దూరం చేయదని ఈ దంపతుల మధ్య ప్రేమానుబంధాలు మరోసారి నిరూపించాయి. ఇటీవల శ్రీనివాస్ గుప్తా కొత్తింటికి గృహప్రవేశం చేశాడు. ఈ శుభ కార్యక్రమానికి తన భార్య లేని లోటు తెలయకుండా ఉండాలని అనుకున్నాడు. మనసుంటే.. మార్గం ఉంటుంది. అతనికి మదిలో ఓ ఆలోచన తట్టింది.

అచ్చం తన భార్యలా ఉండే నిలువెత్తు మైనపు విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో ప్రతిష్టించాడు. ఇంకేముంది కుటుంబసభ్యులు అందరూ కూడా దాన్ని చూసి మురిసిపోయారు. ఆ మైనపు విగ్రహంతో ఫోటోలు దిగి సంతోషించారు. జీవకళ ఉట్టిపడేలా ఉన్న ఆ మైనపు విగ్రహం.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu