గౌరీ లంకేశ్ హత్య కేసు: సిట్‌కు రూ.25లక్షల నగదు బహుమతి

కర్ణాటకలో సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసును దర్యాప్తు చేస్తోన్న సిట్‌కు ప్రభుత్వం రూ.25లక్షల నజరానా ప్రకటించింది. హత్యకేసును క్షణ్ణంగా దర్యాప్తు చేస్తున్నందుకు గానూ ప్రభుత్వం వారికి ఈ రివార్డును ప్రకటించింది. అయితే 2017 సెప్టెంబర్ 5న సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ తన ఇంటి వద్దే హత్యకు గురయ్యారు. ఆమె హత్య కేసును ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. అప్పటినుంచి దర్యాప్తు చేస్తూ వస్తోన్న సిట్.. గతేడాది నవంబర్‌లో సిటీ కోర్టులో అదనపు చార్జిషీటు […]

గౌరీ లంకేశ్ హత్య కేసు: సిట్‌కు రూ.25లక్షల నగదు బహుమతి

Edited By:

Updated on: May 28, 2019 | 10:35 AM

కర్ణాటకలో సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసును దర్యాప్తు చేస్తోన్న సిట్‌కు ప్రభుత్వం రూ.25లక్షల నజరానా ప్రకటించింది. హత్యకేసును క్షణ్ణంగా దర్యాప్తు చేస్తున్నందుకు గానూ ప్రభుత్వం వారికి ఈ రివార్డును ప్రకటించింది. అయితే 2017 సెప్టెంబర్ 5న సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ తన ఇంటి వద్దే హత్యకు గురయ్యారు. ఆమె హత్య కేసును ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. అప్పటినుంచి దర్యాప్తు చేస్తూ వస్తోన్న సిట్.. గతేడాది నవంబర్‌లో సిటీ కోర్టులో అదనపు చార్జిషీటు దాఖలు చేసింది.

ఇందులో సనాతన్ సంస్థాన్‌ పేరును కూడా పొందపరిచింది. గౌరీ లంకేశ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న 18మంది ఈ గ్రూపులో చురుగ్గా ఉన్నట్లు తెలిపింది. అయితే సిట్ ఆరోపణలను సనాతన్ సంస్థాన్ కొట్టిపారేసింది. గౌరీ లంకేశ్ హత్య కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.