కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు గత 24 గంటల వ్యవధిలో కర్ణాటకలో 9,796 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,89,232కు చేరుకుంది. ఇక, 2,83,298 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. మరో 99,617 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు కరోనా మరణాలు కూడా కర్ణాటకలో భారీగానే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 128 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 6,298కి చేరిందని కర్ణాటక ఆరోగ్యశాఖ వెల్లడించింది.