
కర్ణాటకలో యడియూరప్ప సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం మంగళవారంనాడు మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. అనేక నాటకీయ పరిణామాల అనంతరం కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని విశ్వాస పరీక్షలో ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన యడియూరప్ప తాజాగా మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. ఈ మేరకు 17 మంది మంత్రులతో రాజ్‌భవన్‌లో గవర్నర్ బాజూభాయ్ వాలా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో గోవింద మఖ్తప్ప, డాక్టర్ ఆశ్వంత్ నారాయణ్ సీఎస్, లక్ష్మణ్ సంగప్ప సవడి, ఆర్.ఆశోక, బి.శ్రీరాములు, ఎస్.సురేష్ కుమార్, వి.సోమన్న, కోట శ్రీనివాస్ పూజారి, జేసీ మధుస్వామి, చంద్రకాంత్ గౌడ చెన్నప్ప గౌడ పాటిల్, హెచ్.గణేష్, ప్రభు చౌహన్, జొల్లే శశికళ, కేఎస్ ఈశ్వరప్ప, జగదీష్ షెట్టర్, సీటీ రవి, బి.బస్వరాజ్ ఉన్నారు.
C N Ashwath Narayan & Govind M Karjol take oath as Karnataka Cabinet Ministers, in Bengaluru. pic.twitter.com/8rTgPtGudV
— ANI (@ANI) August 20, 2019