ఏపీ ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. మీ తుగ్లక్ పాలనలో రాష్ట్రం తలకిందులైన తాబేలులా తయారయ్యిందని.. అసెంబ్లీ వేదికగా పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్ర భవిష్యత్తును తీవ్ర అయోమయంలోకి నెట్టారని దుయ్యబట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టాలిగానీ పరిపాలన వికేంద్రీకరణ కాదని, అమరావతిలో ఇప్పుడున్న నిర్మాణాలకు, వాటాదారులకు ఏమి సమాధానం చెబుతారని ఆయన ఈ సందర్బంగా ప్రశ్నించారు.
[svt-event date=”20/01/2020,4:36PM” class=”svt-cd-green” ]
రాష్ట్రం మీ తుగ్లక్ పాలనలో తలకిందులైన తాబేలులా తయారయ్యింది.
అసెంబ్లీ వేదికగా పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్ర భవిష్యత్తును తీవ్ర అయోమయంలోకి నెట్టారు..
అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టాలిగానీ పరిపాలన వికేంద్రీకరణ కాదు,అమరావతిలో ఇప్పుడున్న నిర్మాణాలకు,వాటాదారులకు ఏమి సమాధానం చెబుతారు ? pic.twitter.com/tryycDu1tC— Kanna Lakshmi Narayana (@klnbjp) January 20, 2020