AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోల పేర్లు చెప్పి డ్రగ్‌ టెస్ట్‌ చేయించుకోవాలని సూచన

బాలీవుడ్‌ లోని నియంతపోకడలు, అన్యాయాలు, దందాలపై ఒంటరిపోరాటం చేస్తోన్న నటి కంగనా రనౌత్ తన దూకుడును కొనసాగిస్తున్నారు. బాలీవుడ్లో 99 శాతం మంది డ్రగ్స్‌ తీసుకుంటారని ఇటీవలే వివాదాస్పద ప్రకటన చేసి..

హీరోల పేర్లు చెప్పి డ్రగ్‌ టెస్ట్‌ చేయించుకోవాలని సూచన
Pardhasaradhi Peri
|

Updated on: Sep 02, 2020 | 5:33 PM

Share

బాలీవుడ్‌ లోని నియంతపోకడలు, అన్యాయాలు, దందాలపై ఒంటరిపోరాటం చేస్తోన్న నటి కంగనా రనౌత్ తన దూకుడును కొనసాగిస్తున్నారు. బాలీవుడ్లో 99 శాతం మంది డ్రగ్స్‌ తీసుకుంటారని ఇటీవలే వివాదాస్పద ప్రకటన చేసి సంచలనం రేకెత్తించింది కంగనా. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా పేర్లే బయటపెట్టింది. రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, విక్కీ కౌషల్ కొకైన్ బానిసలని పుకార్లు ఉన్నాయి. వీరందరూ డ్రగ్‌ టెస్ట్‌ కోసం బ్లడ్‌ శాంపిల్స్‌ ఇచ్చి ఈ పుకార్లకు స్వస్తి పలకాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. క్లియర్‌ శాంపిల్స్‌తో ఈ యువ నటులందరూ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నానంటూ ఏకంగా ట్వీట్టర్లో కోరింది కంగనా. దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఆమె మాటల్ని కొందరు ఫుల్ గా సమర్థిస్తుంటే, బాలీవుడ్ లోని అందరికీ డ్రగ్స్ ఆపాదించడం అన్యాయమంటూ కొందరు సెలబ్రెటీలు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉండగా, గతేడాది రాజకీయనేత మంజిందర్ సింగ్ సిర్సా వివాదాస్పద కామెంట్ చేశారు. ఆయన కరణ్ జోహార్ పార్టీకి చెందిన ఒక వీడియోను షేర్‌ చేస్తూ ఆ వీడియోలోని వారందరూ డ్రగ్స్‌ తీసుకున్న స్థితిలోనే ఉన్నారు అంటూ ట్వీట్‌ చేశారు. ఈ వీడియో కరణ్‌ జోహార్‌ ఇంట్లోనిది. దీనిని మొదట కరణ్‌ జోహారే షేర్‌ చేశారు. ఈ వీడియోలో రణబీర్, అయాన్, విక్కీ, దీపికా పదుకొనే, అర్జున్ కపూర్, మలైకా అరోరా, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్ తదితరులు ఉన్నారు. అప్పటినుంచి వీరిపై డ్రగ్స్ రూమర్లు చెలరేగుతున్నాయి.

Follow Us
మూవీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా... హైదరాబాద్‌కు హాలీవుడ్‌
మూవీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా... హైదరాబాద్‌కు హాలీవుడ్‌
వార్నీ ఇంత సింపులా.. కల్తీ కారం పొడిని ఇంట్లోనే ఇలా కనిపెట్టండి..
వార్నీ ఇంత సింపులా.. కల్తీ కారం పొడిని ఇంట్లోనే ఇలా కనిపెట్టండి..
జులైలో భారీ ఆదాయం తెచ్చిపెట్టిన GST
జులైలో భారీ ఆదాయం తెచ్చిపెట్టిన GST
ఎగిరే పక్షి.. అద్భుతం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్!
ఎగిరే పక్షి.. అద్భుతం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్!
ఆగస్ట్‌లో తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు భారీగా సెలవులు!
ఆగస్ట్‌లో తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు భారీగా సెలవులు!
భారత అంతరిక్ష చరిత్రలో సిరిసిల్ల ముద్ర.. విక్రమ్-1 రాకెట్ విజయంలో
భారత అంతరిక్ష చరిత్రలో సిరిసిల్ల ముద్ర.. విక్రమ్-1 రాకెట్ విజయంలో
ఆ హీరో చాలా పిసినారి.. నోరు తెరిస్తే డబ్బు తప్ప ఏం మాట్లాడడు
ఆ హీరో చాలా పిసినారి.. నోరు తెరిస్తే డబ్బు తప్ప ఏం మాట్లాడడు
భారత్‌ ముందు అతిపెద్ద గండం.. వాతావరణంలో ఊహించని మార్పులు
భారత్‌ ముందు అతిపెద్ద గండం.. వాతావరణంలో ఊహించని మార్పులు
5 గుడ్లు తిన్నా రాని శక్తి వీటితో డబుల్.. గుర్రంలా పరిగెడతారు
5 గుడ్లు తిన్నా రాని శక్తి వీటితో డబుల్.. గుర్రంలా పరిగెడతారు
మండుతున్న వర్షాకాలం.. కరువు కొరల్లోకి రైతన్నలు.. ఏ పంటలు వేయాలో
మండుతున్న వర్షాకాలం.. కరువు కొరల్లోకి రైతన్నలు.. ఏ పంటలు వేయాలో