నేనూ డ్రగ్ అడిక్ట్ నే ! ఒప్పుకున్న కంగనా రనౌత్
సుశాంత్ కేసులో కంగనా రనౌత్, రియా చక్రవర్తి వంటి వ్యక్తులు, డ్రగ్స్ లాంటి అంశాలు కీలకంగా మారిన వేళ.. తానూ డ్రగ్ అడిక్ట్ నే అని కంగనా ఒప్పుకున్న వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏడాది మార్చిలో..
సుశాంత్ కేసులో కంగనా రనౌత్, రియా చక్రవర్తి వంటి వ్యక్తులు, డ్రగ్స్ లాంటి అంశాలు కీలకంగా మారిన వేళ.. తానూ డ్రగ్ అడిక్ట్ నే అని కంగనా ఒప్పుకున్న వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏడాది మార్చిలో మనాలీ లోని తన ఇంట్లో ఈమె తనగురించి ఓ నాలుగు నిముషాలు చెప్పుకుంది. అందులో.. తనకు 15-16 ఏళ్ళ వయస్సులో ఇంటినుంచి పారిపోయానని, ఆ తరువాత ఫిల్మ్ స్టార్ నయ్యానని, అప్పుడే మత్తుమందులకు అలవాటు పడ్డానని ఆమె తెలిపింది. నా జీవితంలో ఎన్నోఒడిదుడుకులను ఎదుర్కొన్నాను, ఎంతోమంది చేతిలో దాదాపు మోసపోయాను అని ఆమె తెలిపింది. ఇదంతా ఎలా ఉన్నా డ్రగ్స్ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలే ముఖ్యమయ్యాయి. ఆమెకు డ్రగ్స్ తో లింక్ ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపించడమే గాక దీనిపై దర్యాప్తునకు ఆదేశిస్తామని కూడా ప్రకటించింది. పైగా నటుడు అధ్యాయన్ సుమన్ కూడా ఈ విషయాన్ని ఓ ఇంటర్వూలో చెప్పాడు. ఈ తరుణంలో కంగనా వీడియో రావడం సంచలనమే మరి !
View this post on Instagram#KanganaRanaut talks about the time when she couldn’t close her eyes because tears won’t stop. ??