
డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఓ బీజేపీ నేత వార్నింగ్ ఇచ్చారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టైటిల్ మార్చాలంటూ.. వర్మకు బీజేపీ నేత వార్నింగ్ ఇవ్వడంతో ఈ వార్త వైరల్‌గా మారింది. అంతేకాకుండా.. ఈ టైటిల్‌పై సెన్సార్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేశారు బీజేపీ నేత.
నిత్యం ఏదో ఒక వివాదాలకు పురుడు పోసే వ్యక్తి.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అనే చెప్పాలి. ఏ విషయంపైనైనా.. స్పందించడంలో ముందు కూడా ఉంటారు. ఈ మధ్యనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీసి పలు వివాదాలకు ఆజ్యం పోశారు. తాజాగా.. ఆయన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే.. ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసి పెద్ద దుమారమే సృష్టించారు. ఆంధ్రప్రదేశ్‌లోని.. రెండు పెద్ద పొలిటికల్ పార్టీల మధ్య వైరాన్ని ఆయన సినిమాగా తీయడంతో.. పలు వివాదాలు భగ్గుమంటున్నాయి.
తాజాగా.. ఆర్జీవీపై.. ఏపీ యువమోర్చా అధ్యక్షుడు రమేష్ నాయుడు వార్నింగ్ ఇచ్చారు. తన సినిమా టైటిల్ మార్చాలంటూ.. సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. కాగా.. మరోవైపు ఈ సినిమా టైటిల్ వివాదంపై ఇప్పటికే రాంగోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు. ‘నా సినిమా నా ఇష్టం’.. సెన్సార్ బోర్డు రద్దు చేస్తే నాకే నష్టం. మిమ్మల్ని సినిమా చూడమని నేనేం చెప్పలేదు.. చెప్పను కూడా.. అంటూ.. తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు ఆర్జీవీ.