యూఎస్ రాజకీయ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ మహిళ ప్రెసిడెంట్, వైఎస్ ప్రెడిసెండ్ పీఠాన్ని అధిష్టించలేదు. ఈ ఎన్నికల్లో వాటన్నిటినీ తిరగరాస్తూ.. డెమొక్రటిక్ పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్ పదవిని కమలా హారిస్ అలంకరించబోతున్నారు. అంతేకాదు.. తొలి మహిళగా కమలా కొత్త అధ్యాయం లిఖించనున్నారు. 1984లో డెమొక్రాట్ జెరాల్డిన్ ఫెరారో, 2008లో రిపబ్లికన్ సారా పాలిన్ బరిలో నిలిచినా.. పార్టీల ఓటమి కారణంగా వారు విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారు. కమలాహారిస్ ఎన్ని ఆటంకాలు, విమర్శలు ఎదురైనా.. తన ప్రతిభతో పైకి రావడమే కాదు.. ఉపాధ్యక్ష పదవిని దక్కించుకున్న తొలి మహిళగా నిలవబోతున్నారు. ప్రస్తుతం ఉపాధ్యక్ష పదవిలో ఉండబోయే.. కమలాహారిసే నెక్ట్స్ టైం అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉంది.
I hope every little girl watching tonight sees that this is a country of possibilities. pic.twitter.com/E4GYfr2QoO
— Kamala Harris (@KamalaHarris) November 8, 2020