లోకనాయకుడు కమల్ హాసన్ నటుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ రాణించాలని ప్రయత్నిస్తున్నారు.వచ్చే ఏడాదిలో రాబోతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కమల్.అయితే ఈ లోపే కమిట్అయిన సినిమాలను కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.
ప్రస్తుతం కమల్ శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’సినిమా చేస్తున్నారు. సినిమా షూటింగ్ క్రేయిన్ యాక్సిడెంట్ కారణంగా ఆగిపోయింది. త్వరలోనే షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ సినిమా తోపాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’అనే యాక్షన్ థ్రిల్లర్ లో కూడా నటిస్తున్నారు కమల్. ఈ రెండు సినిమాలను మూడు నెలలోనే పూర్తి చేయాలని భావిస్తున్నారట కమల్ హాసన్. వచ్చేఏడాది మార్చిలో సినిమాలు పూర్తి చేసి ఆతర్వాత పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టాలని చూస్తున్నారు కమల్.