దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా లాక్‌డౌన్ కారణంగా అసోంలోని చారిత్రాత్మకమైన కామాఖ్యా ఆలయానికి భారీగా నష్టం సంభవించింది. మార్చి 18వ తేదీ నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదు. కేవలం పూజారులు మాత్రమే పూజలు చేస్తున్నారు. ఆలయానికి భక్తుల రాకను నిలిపివేయడంతో లాక్‌డౌన్ కాలంలో రూ 6 కోట్ల నష్టం సంభవించినట్లు ఆలయ కమిటీ వెల్లడించింది.
మాములుగా అయితే.. ఈ ఆలయానికి ప్రతి రోజు 20 వేల నుంచి 30 వేల మంది భక్తులు తరలిరావడంతో పాటు రూ. 1.5 లక్షల ఆదాయం వచ్చేది. గత ఐదు నెలల నుంచి ఒక్క భక్తుడిని కూడా అనుమతించలేదు. ఇక ప్రతి రోజు పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు తెలిపారు. ఈ టెంపుల్‌పై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న పలువురికి తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఆలయంలో పని చేసే సిబ్బందికి.. ప్రతి నెల జీతాలను చెల్లిస్తున్నామని పూజారి స్పష్టం చేశారు.
Read More:
ఏపీలోని ఆ జిల్లాలో.. 50 ఏళ్లు పైబడిన వారికి.. నో హోమ్ ఐసోలేషన్..!