AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: కాపాడండయ్యా నన్ను.. భార్య నుంచి రక్షణ కల్పించాలని పీజీఆర్ఎస్‌లో భర్త ఫిర్యాదు!

సాధారణంగా భర్తలు తమను వేధిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని భార్యలు పోలీస్ స్టేషన్లకో లేదా పెద్దల దగ్గర పంచాయితీకో వెళ్తుంటారు. ఇలాంటివి మనం చాలానే చూశాం. కానీ కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన ఓ ఘటన మాత్రం ఇందుకు పూర్తి రివర్స్‌లో ఉంది. భార్య నుంచి తనను కాపాడాలని ఓ వ్యక్తి పీజీఆర్‌ఎస్ కార్యాలయానికి వచ్చి మొరపెట్టుకున్నాడు.

Andhra News: కాపాడండయ్యా నన్ను.. భార్య నుంచి రక్షణ కల్పించాలని పీజీఆర్ఎస్‌లో భర్త ఫిర్యాదు!
Man Appeals To Officials For Protection From Abusive Wife
Anand T
|

Updated on: Sep 08, 2026 | 7:07 AM

Share

తన భార్య నుంచి రక్షణ కల్పించాలని ఓ వ్యక్తి పీజీఆర్‌ఎస్ కార్యాలయానికి వచ్చి అధికారులను వేడుకున్న ఘటన కాకినాడ జిల్లాలో వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురానికి చెందిన బల్లిపాటి శివాజీ, పదేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన దుర్గ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. 2024 వరకు వీరి జీవితం సాఫీగానే సాగింది. కానీ, ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది.

టీవీ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగించే శివాజీకి 2024లో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో కాలు విరిగి అతను మంచానికే పరిమితమయ్యాడు. అప్పటి నుంచి కర్ర సహాయంతోనే నడిచేవాడు. ఇక అప్పటి నుంచి భార్య తనను సరిగ్గా పట్టించుకోవడం లేదని, రోజూ కొట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అన్నంలో విషం పెట్టి చంపేస్తానని బెదిరించడం చేస్తోందని బాధితుడు ఆరోపించాడు. ఈ విషయంపై చాలాసార్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే పాడా (PADA) కార్యాలయానికి వచ్చినట్లు తెలిపాడు.

అంతేకాదు, గత కొన్ని రోజులుగా తన కొడుకుపై కూడా ఆమె వివక్ష చూపుతోందని, తనను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తోందని ఆరోపించాడు. అంతటితో ఆగకుండా తనపైనే కేసు పెడతానని బెదిరిస్తోందని వాపోయాడు. తన భార్య నుంచి ఎలాగైనా తనను కాపాడాలని, తన ప్రాణానికి రక్షణ కల్పించాలని అతను అధికారులను కోరాడు. ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భార్య నుంచి రక్షణ కల్పించాలని పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేసిన భర్త!
భార్య నుంచి రక్షణ కల్పించాలని పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేసిన భర్త!
ఈ ఫ్లవర్ అంత పవర్ ఫుల్లా.. ఒక్క గ్లాస్ తాగితే..!
ఈ ఫ్లవర్ అంత పవర్ ఫుల్లా.. ఒక్క గ్లాస్ తాగితే..!
దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈషాన్ కిషన్ విశ్వరూపం
దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈషాన్ కిషన్ విశ్వరూపం
కొన్నేళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై అడుగు పెట్టనున్న భారత ఆటగాళ్లు
కొన్నేళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై అడుగు పెట్టనున్న భారత ఆటగాళ్లు
పార్క్ చేసిన కారులో వింత శబ్ధాలు.. దగ్గరకెళ్లి చూడగా షాక్!
పార్క్ చేసిన కారులో వింత శబ్ధాలు.. దగ్గరకెళ్లి చూడగా షాక్!
ఆసియా గేమ్స్ షెడ్యూల్ ఇదే.. టీమిండియాతో తలపడే జట్లు ఇవే..?
ఆసియా గేమ్స్ షెడ్యూల్ ఇదే.. టీమిండియాతో తలపడే జట్లు ఇవే..?
అప్పుడే ఓటీటీలోకి యశ్ 'టాక్సిక్'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
అప్పుడే ఓటీటీలోకి యశ్ 'టాక్సిక్'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మంగళకరమైన రోజు మంగళవారం మీ రాశి ఎలా ఉందంటే..?
మంగళకరమైన రోజు మంగళవారం మీ రాశి ఎలా ఉందంటే..?
టెన్త్ అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. సెప్టెంబర్ 18 వరకే ఛాన్స్‌!
టెన్త్ అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. సెప్టెంబర్ 18 వరకే ఛాన్స్‌!
హీరోను చూసి పరాఠాలు.. తెలుపు మిస్సైందని ఎరుపుతోనే జర్నీ
హీరోను చూసి పరాఠాలు.. తెలుపు మిస్సైందని ఎరుపుతోనే జర్నీ