September 08, 2026
venkata chari
నేరేడు పండ్లు రుచితో పాటు విటమిన్లు, మినరల్స్, ఔషధ గుణాలు ఉన్న పండ్లు. అయితే, డయాబెటిస్, మలబద్ధకం, జీర్ణ సమస్యలు, అలర్జీలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
నేరేడు పండ్లు అంటే చాలామందికి ఇష్టమే. రుచితో పాటు ఇందులో విటమిన్లు, మినరల్స్, ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు.
అయితే ప్రతి ఒక్కరూ నేరేడు పండ్లను తీసుకోవడం సరైనది కాదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణుల సూచిస్తున్నారు.
డయాబెటిస్ ఉన్నవారు నేరేడు పండ్లు తినకూడదు. వీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆహారంలో వీటిని చేర్చే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
మలబద్ధకం లేదా ఇతర జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా నేరేడు పండ్లకు దూరంగా ఉండాలి. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు వీటిని తీసుకోకూడదు.
ప్రయాణ సమయంలో వాంతులు అయ్యే అలవాటు ఉన్నవారు కూడా జర్నీలో నేరేడు పండ్లు తీసుకోకూడదు.
అలర్జీ సమస్యలు ఉన్నవారు నేరేడు పండ్లను తినకూడదు. అంటే నేరేడు పండ్లు సాధారణంగా ఆరోగ్యకరమైనవే. కాని కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల్లో దూరంగా ఉండాలి.
ఈ కథనంలో అందించిన సమాచారం నెట్‌లో సెర్చ్ చేసి అందించాం. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితుల్లో ఆహారంపై నిర్ణయం తీసుకునే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.