సెప్టెంబర్ 2న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా రేపు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపులపాయ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ అన్బురాజన్, సబ్ కలెక్టర్ పృథ్వితేజ్ ఇడుపులపాయలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
హెలిప్యాడ్ వద్ద బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలసి సీఎం జగన్ నివాళులు అర్పిస్తారు. ఈ సందర్బంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్బంగా వైఎస్ఆర్ ఘాట్, హెలిప్యాడ్ వద్ద ఆటోమేటిక్ శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్‌లను ఏర్పాటు చేశారు.
ఘాట్ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి కోవిడ్ టెస్ట్ తప్పనిసరి అని.. లేదంటే అనుమతించేది లేదని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.