జూనియర్ ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్ వీడియో.. స్కూల్‌ ఏజ్‌లోనే అదరగొట్టాడు..

జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ పైకి అమాయకంగా కనిపించినా అల్లరికి చిరునామా. అతని పక్కన నటించే హీరోయిన్స్‌నే కాకుండా....

జూనియర్ ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్ వీడియో.. స్కూల్‌ ఏజ్‌లోనే అదరగొట్టాడు..

Edited By:

Updated on: Jul 01, 2020 | 6:43 PM

జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ పైకి అమాయకంగా కనిపించినా అల్లరికి చిరునామా. అతని పక్కన నటించే హీరోయిన్స్‌నే కాకుండా.. డైరెక్టర్స్‌, సైడ్ యాక్టర్స్‌ని కూడా మనోడు వదలడు. ఏదో ఒక రూపంలో ఆట పట్టిస్తూ ఉంటాడు. అందులోనూ ముఖ్యంగా రాజమౌళి, వివి వినాయక్‌లు ఉంటే మనోడికి పండగే అని చెప్పుకోచ్చు. ఎందుకంటే వారితో ఎన్టీఆర్‌కి ఉన్న చనువు అలాంటిది.

ఇక తారక్ మంచి నటుడు మాత్రమే కాదు భరతనాట్యంలో కూడా సిద్ధహస్తుడు. చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్‌లో శిక్షణ తీసుకున్నాడు ఎన్టీఆర్. అందుకే ఇప్పుడు ఎలాంటి కష్టతరమైన స్టెప్పు అయినా అలా చిటికెలో చేసి చూపిస్తారు. చిన్నప్పటి నుంచే స్టేజ్‌పై ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చారు. కాగా జూనియర్ ఎన్టీఆర్.. స్కూల్‌ ఏజ్‌లో ఉన్నప్పుడు ఇచ్చిన ఓ క్లాసికల్ డాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.

కాగా క్లాసికల్ డాన్స్‌లో తన మెళుకువలు చూపించారు ఎన్టీఆర్. ‘బాల రామాయణం’ సినిమా కంటే ముందు ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు జూనియర్. ‘బాల రామాయణం’ తర్వాత మూడేళ్లకు ‘నిన్ను చూడాలని’ అనే సినిమాలో హీరోగా పరిచయమయ్యాడు. ఇక ఆ తర్వాత ‘స్టూడెంట్ నెంబర్ 1’, ‘ఆది’ వంటి బ్లాక్‌ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.

Read More: 

పోలీసులకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఫిర్యాదు..

ఆ షూటింగ్ చివరి రోజే మహేష్‌ని ప్రేమిస్తున్నానని అర్థమైంది..

బ్రేకింగ్: సీరియల్ నటి నవ్యా‌ స్వామికి కరోనా పాజిటివ్..