ట్రంప్ కు కరోనాపై ప్రత్యర్థి జో బైడెన్ రియాక్షన్

|

Oct 02, 2020 | 11:02 PM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అతని భార్య మెలానియా కరోనా బారినపడిన విషయమై అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అయిన జో బైడెన్ స్పందించారు. అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా త్వరగా కోలుకోవాలని తన అర్ధాంగి జిల్, తాను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామంటూ బైడెన్ ట్వీట్ చేశారు. అమెరికా దేశాధ్యక్షుడు, ఆయన కుటుంబం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని తాము ప్రార్థిస్తూనే ఉంటామని తెలిపారు. కాగా, అమెరికాలో నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్న సంగతి తెలిసిందే. […]

ట్రంప్ కు కరోనాపై ప్రత్యర్థి జో బైడెన్ రియాక్షన్
Follow us on

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అతని భార్య మెలానియా కరోనా బారినపడిన విషయమై అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అయిన జో బైడెన్ స్పందించారు. అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా త్వరగా కోలుకోవాలని తన అర్ధాంగి జిల్, తాను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామంటూ బైడెన్ ట్వీట్ చేశారు. అమెరికా దేశాధ్యక్షుడు, ఆయన కుటుంబం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని తాము ప్రార్థిస్తూనే ఉంటామని తెలిపారు. కాగా, అమెరికాలో నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారినపడడం చర్చనీయాంశంగా మారింది.

అయితే, అంతకుముందు చేసిన ఒక ట్వీట్ లో మాత్రం బైడెన్, ట్రంప్ పై విమర్శల వర్షం కురిపించారు. కరోనా నివారణలో తాను విఫలమయ్యానన్న వాస్తవం నుంచి దృష్టి మరల్చేందుకు ట్రంప్ ఏదైనా చేస్తాడని విమర్శించారు. కరోనా మహమ్మారికి అమెరికా దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా అమెరికన్లు చనిపోయారని, 26 మిలియన్ల మంది ఉపాధి లేకుండా ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి 6 చిన్నతరహా వ్యాపారాల్లో ఒకటి శాశ్వతంగా మూతపడే పరిస్థితి వచ్చిందని బైడెన్ విమర్శించారు. ట్రంప్ ను మళ్లీ గెలిపించరాదని బైడెన్ అమెరికన్లకు విన్నవించారు.