సెప్టెంబర్‌లో చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్.. ఇళ్ల దగ్గరే పరీక్షా కేంద్రాలు..!

|

Aug 19, 2020 | 3:27 PM

యూజీ, పీజీ చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని యూజీసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి.

సెప్టెంబర్‌లో చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్.. ఇళ్ల దగ్గరే పరీక్షా కేంద్రాలు..!
Follow us on

JNTUK Key Decision: యూజీ, పీజీ చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని యూజీసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే జేఎన్టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం కారణంగా ఇప్పటికే విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో.. వారి ఇళ్లకు సమీపంలోనే ఎగ్జామ్ సెంటర్లను కేటాయించాలని నిర్ణయించింది.

కాగా, జేఎన్టీయూ అనంతపురం సెప్టెంబర్ 3వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తుండగా.. కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్‌ను వచ్చే నెల రెండోవారంలో ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు జేఎన్టీయూహెచ్ పరిధిలో బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల ఫైనల్ ఇయర్ చివరి సెమిస్టర్ పరీక్షలను సెప్టెంబర్ 16 నుంచి వారం రోజుల పాటు నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు షెడ్యూల్‌ను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. విద్యార్ధులు తమకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్లలోనే పరీక్ష రాసేందుకు వీలుగా వెసులుబాటును కల్పించారు.

Also Read:

తెలంగాణలో విస్తరిస్తున్న కొత్త వైరస్.. ఆందోళనలో రైతులు..

మరో కరోనా లక్షణం.. బాధితుల్లో హెయిర్ లాస్..!

ఏపీలో ఇకపై రిజిస్ట్రేషన్ ప్రక్రియ వీడియో రికార్డింగ్..!