JNTUH Special Eamcet: తెలంగాణ విద్యార్ధులకు అలెర్ట్. అక్టోబర్ 3న(శనివారం) జేఎన్టీయూహెచ్ పరిధిలో జరగాల్సిన ప్రత్యేక ఎంసెట్, ఈసెట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ వెల్లడించారు. ఎంసెట్ పరీక్షా సమయంలో కరోనా బారిన పడిన విద్యార్ధులకు ప్రత్యేక ఎంసెట్, ఈసెట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే అనివార్య కారణాల వల్ల శనివారం అనగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేశారు. కాగా, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు.
Also Read:
గ్రామ/వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..
సోనూసూద్ గొప్ప మనసు.. బాలుడి వైద్యానికి రూ. 20 లక్షల సాయం..
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పండగ సీజన్‌లో 200 స్పెషల్ ట్రైన్స్.!