జార్ఖండ్ చివరి దశలో 70.83 శాతం పోలింగ్!

| Edited By: Pardhasaradhi Peri

Dec 20, 2019 | 8:48 PM

జార్ఖండ్‌లోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదవ, చివరి దశ పోలింగ్ శాంతియుతంగా ముగిసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మొత్తం 40.05 లక్షల మంది ఓటర్లలో 70.83 శాతం మంది సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వారు తెలిపారు. అయితే, అన్ని నియోజకవర్గాలకు పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. కాగా.. ఐదు ఉగ్రవాద ప్రభావిత స్థానాలకు ఓటింగ్ మధ్యాహ్నం 3 గంటలకే ముగిసింది. అన్ని బూత్‌ల నుండి సమాచారం ఇంకా […]

జార్ఖండ్ చివరి దశలో 70.83 శాతం పోలింగ్!
Follow us on

జార్ఖండ్‌లోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదవ, చివరి దశ పోలింగ్ శాంతియుతంగా ముగిసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మొత్తం 40.05 లక్షల మంది ఓటర్లలో 70.83 శాతం మంది సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వారు తెలిపారు. అయితే, అన్ని నియోజకవర్గాలకు పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. కాగా.. ఐదు ఉగ్రవాద ప్రభావిత స్థానాలకు ఓటింగ్ మధ్యాహ్నం 3 గంటలకే ముగిసింది. అన్ని బూత్‌ల నుండి సమాచారం ఇంకా పోల్ ప్యానల్‌కు చేరుకోనందున పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

నవంబర్ 30 డిసెంబర్ 16 మధ్య రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాల్లో నాలుగు దశల్లో 65 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 23 న ఫలితాలు వెల్లడవుతాయి. రాష్ట్రంలోని 5,389 పోలింగ్ కేంద్రాలలో, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 396 క్లిష్టమైనవిగా, 208 సున్నితమైనవి గా గుర్తించబడ్డాయి. ఎన్నికల సంఘం 8,987 బ్యాలెట్ యూనిట్లు, 6,738 కంట్రోల్ యూనిట్లు, 7,006 వివిపాట్ యంత్రాలను ఏర్పాటు చేసింది.