Jhanvi Kapoor Belly Dance: అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఎంతో స్టార్‌డమ్ ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. స్టార్ కిడ్‌గా ఎంతో పరపత్తి ఉన్నా మొదటి చిత్రంలో ‘దఢక్’ వంటి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది.
ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండడం జాన్వీకి అలవాటు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత వివరాలతో పాటు జిమ్, డ్యాన్స్ క్లాస్ ఇలా ప్రతీ విషయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుటుంది. ఇక జాన్వీకి బెల్లీ డ్యాన్స్‌లోనూ ప్రావీణ్యత ఉంది. కరోనాకు ముందు జాన్వీ బెల్లీ డ్యాన్స్‌లో శిక్షణ కూడా తీసుకుంది. అయితే ప్రస్తుతం క్లాస్‌లకు దూరంగా ఉంటోందీ చిన్నది. బెల్లీ డ్యాన్స్ క్లాస్‌లను మిస్ అవుతోన్న జాన్వీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. వైట్ టీషర్ట్‌లో పాటకు అనుగుణంగా జాన్వీ వేసిన బెల్లీ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోతోపాటు.. ‘బురిటో బెల్లీ డ్యాన్స్ సెషన్లు మిస్ అవుతున్నా’ అంటూ క్యాప్షన్ జోడించింది. జాన్వీ బెల్లీ స్టెప్పులపై మీరూ ఓ లుక్కేయండి..
Also Read: Kapatadhaari Trailer : ఆకట్టుకుంటున్న ‘కాపధారి’ ట్రైలర్.. క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్న సుమంత్