జేఈఈ మెయిన్ పరీక్ష యధాతధం: కేంద్రం

|

Aug 21, 2020 | 7:23 PM

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 6 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరగాల్సిన జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేయట్లేదని కేంద్రం స్పష్టం చేసింది.

జేఈఈ మెయిన్ పరీక్ష యధాతధం: కేంద్రం
Follow us on

JEE Main, NEET exams will not be postponed: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 6 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ఏడాది జరగాల్సిన ఎగ్జామ్స్‌ను వాయిదా వేయట్లేదని స్పష్టం చేసింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ ఖరే ఈ విషయాన్ని బార్ అండ్ బెంచ్‌కు ధృవీకరించారు. “నీట్ 2020 వాయిదా పడదని.. సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసిందని” ఆయన అన్నారు.

గతవారం కరోనా కారణంగా ఈ ఏడాది జరగాల్సిన నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. సెప్టెంబరులో జరగాల్సిన నీట్, జేఈఈ (మెయిన్) పరీక్షలను రద్దు చేయాలని కేంద్రాన్ని అదేశించడమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు కేంద్రాల సంఖ్యను పెంచాలంటూ పిటిషనర్లు అపెక్స్ కోర్టును కోరారు.

Also Read:

”భారత్‌లో డిసెంబర్ 3 నాటికి కరోనా అంతం”

కరోనా సోకినట్లయితే.. మొదటిగా కనిపించే లక్షణం ఇదే..!

కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..