స్టార్ వారసురాలి ఎంట్రీ అంటూ తెగ హడావిడి చేసిన బాలీవుడ్ మేకర్స్.. జాన్వీ కపూర్‌కు ఆ స్థాయి ఆఫర్స్ మాత్రం ఇవ్వటం లేదు. శ్రీదేవి కూతురికి గ్రాండ్‌గా వెల్కం చెప్పిన నార్త్ ఇండస్ట్రీ… ఆఫర్స్ విషయంలో మాత్రం పక్కకు పెట్టేసింది. ఏదో మెసేజ్ ఓరియంటెండ్ సినిమాలే గానీ అమ్మడి గ్లామర్‌కు… ఇమేజ్‌కు తగ్గ సినిమా ఇంత వరకు ఒక్కటి కూడా పడలేదు. ‘ధడక్’తో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ… ఫస్ట్ మూవీతోనే నటిగా ఫుల్ మార్క్స్ కొట్టేశారు. ఆ తరువాత చేసిన ‘గుంజన్ సక్సెనా’ కూడా జాన్వీకి నటిగా పేరు తెచ్చి పెట్టిందే కానీ.. గ్లామర్ గర్ల్ ఇమేజ్ మాత్రం తీసుకురాలేకపోయింది. అంతేకాదు శ్రీదేవి వారసురాలు వస్తున్నారూ… అని అంత హడావిడి చేసిన బాలీవుడ్ కూడా అమ్మడికి ఒక్కస్టార్ హీరో సినిమాలోనూ ఛాన్స్ ఇవ్వలేదు.
ప్రజెంట్ జాన్వీ చేతిలో ఉన్న సినిమాలు కూడా అంత క్రేజీగా ఏం లేవు. రాజ్‌కుమార్ రావుతో ‘రూహీ అఫ్జానా’, కార్తీక్ ఆర్యన్‌తో ‘దోస్తానా 2’ సినిమాలు చేస్తున్నారు జాన్వీ. ఇలా అప్‌కమింగ్ హీరోలే తప్ప స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు జాన్వీకి ఛాన్సే ఇవ్వటం లేదు. అమ్మడి ఇమేజ్ తమను డామినేట్ చేస్తుందనుకుంటున్నారో.. లేక గ్లామర్ విషయంలో ఇంకా జాన్వీ.. తన మార్క్ చూపించలేకపోయారో గానీ శ్రీదేవి వారసురాలికి సరైన సినిమా అయితే పడటం లేదని ఫీల్ అవుతున్నారు జాన్వీ ఫ్యాన్స్.
Also Read : యాంకర్ భామల ఫోటో షూట్లు : శీతాకాలంలో సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నారు…