AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20.. ఉత్సాహంలో టీమిండియా.. గాయల బెడదతో కంగారూలు..

మూడు టీ20 సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండవ టీ20 మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 1.40 గంటలకు సిడ్నీ క్రికెట్ మైదానంలో ప్రారంభం కానుంది.

నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20.. ఉత్సాహంలో టీమిండియా.. గాయల బెడదతో కంగారూలు..
Shiva Prajapati
|

Updated on: Dec 06, 2020 | 1:15 PM

Share

మూడు టీ20 సిరీస్‌ల‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండవ టీ20 మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 1.40 గంటలకు సిడ్నీ క్రికెట్ మైదానంలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న రెండు జట్లూ బలమైన ప్లేయర్లలో బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే టీ20 సిరీస్ టీమిండియా వశం అవుతుంది. ఒకవేళ ఆస్ట్రేలియా గెలిస్తే మాత్రం థర్డ్ మ్యాచ్‌లో రసవత్తర పోరు తప్పదనే చెప్పాలి. ఇక తొలి టీ20 విజయోత్సాహంతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే, మూడు వన్డే సరీస్‌లో భాగంగా జరిగిన రెండు వన్డే మ్యాచ్‌లు సిడ్నీ క్రికెట్‌ మైదనాంలోనే జరిగాయి. ఈ మ్యాచ్‌ల్లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. దాన్ని దృష్టిలో ఉంచుకున్న టీమిండియా ఈసారి ఎలాగైనా రివేంజ్ తీసుకోవాలని గట్టి పట్టుదలతో బరిలోకి దిగుతోంది.

ఇక ఆసిస్ జట్టుకు ఈ మ్యాచ్ చావో రేవో అన్నట్లే.. ఈ మ్యాచ్‌ ఓడితే సిరీస్‌ను కోల్పోవాల్సి వస్తుంది. గెలిస్తే సిరీస్‌పై హోప్స్ పెట్టుకోవచ్చు. మరోవైపు ఆసిస్ జట్టును గాయాల బెడద వేధిస్తోంది. గాయాల కారణంగా ఇప్పటికే వార్నర్, అగర్, స్టోయినిస్‌ జట్టుకు దూరమయ్యారు. వీరికి తోడుగా ఇప్పుడు ఫించ్ చేరాడు. ఫించ్ తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నాడట. దీంతో అతను ఈ మ్యాచ్‌లో ఆడుతాడా? లేదా? అనేది అనుమానమే. ఇక ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఏకంగా టీ20 సిరీస్‌కే దూరమయ్యాడు. తొలి టీ20లో అద్భుత ప్రదర్శన కనబర్చిన స్టార్క్.. తన కుటుంబ సభ్యులకు అనారోగ్యం కారణంగా సిరీస్‌కు దూరమవుతున్నట్లు తాజాగా ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆసిస్ జట్టు చీఫ్ కోచ్ లాంగర్ స్వయంగా వెల్లడించాడు.

ఇక భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా 11 పరుగుల తేడాతో కంగారూలపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, జడేజా, హార్దిక్ పాండ్యా రాణించారు. అయితే రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా జట్టు నుండి జడేజా దూరమయ్యాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న జడేజా గాయం కారణంగా జట్టుకు దూరమవడం నిరాశపరిచే అంశం. అయితే జడేజా స్థానాన్ని లెగ్ స్పిన్నర్ చాహల్ భర్తీ చేయనున్నాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే షమీ, బూమ్రాల ఎంపిక మధ్య సందిగ్ధత నెలకొంది. ఇక మనీశ్ పాండే స్థానంలో శ్రేయాస్‌కు అవకాశం కల్పించవచ్చని క్రికెట్ నిపుణులు అంటున్నారు.

జట్ల అంచనా ఇలా ఉంది…

భారత్‌: ధవన్‌, రాహుల్‌, కోహ్లీ (కెప్టెన్‌), శాంసన్‌, మనీశ్‌/శ్రేయాస్‌, హార్దిక్‌, సుందర్‌, దీపక్‌ చాహర్‌, నటరాజన్‌, బుమ్రా/షమి, చాహల్‌.

ఆసీస్‌: డార్సీ షార్ట్‌, ఫించ్‌/వేడ్‌, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, హెన్రిక్స్‌, క్యారీ, అబాట్‌, స్టార్క్‌(సందేహం), లియాన్‌, జంపా, హాజెల్‌వుడ్‌.