అఖిల్-మోనాల్ మధ్య మళ్ళీ.. తనతో ఎందుకు అంత క్లోజ్‏గా ఉంటున్నావ్.. అడిగి మరీ హగ్ తీసుకుంటున్నావు, ఏంటీ కథ?..

తెలుగు బిగ్‏బాస్ షో ఎంత పాపులర్ అయ్యిందో, అందులో జరిగే ప్రేమ కహానీలు కూడా అంతే రేంజ్‏లో పాపులారిటీని పొందిన విషయం తెలిసిందే. అయితే బిగ్‏బాస్

అఖిల్-మోనాల్ మధ్య మళ్ళీ.. తనతో ఎందుకు అంత క్లోజ్‏గా ఉంటున్నావ్.. అడిగి మరీ హగ్ తీసుకుంటున్నావు, ఏంటీ కథ?..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 06, 2020 | 11:50 AM

Telugu Big Boss Season 4: తెలుగు బిగ్‏బాస్ షో ఎంత పాపులర్ అయ్యిందో, అందులో జరిగే ప్రేమ కహానీలు కూడా అంతే రేంజ్‏లో పాపులారిటీని పొందిన విషయం తెలిసిందే. అయితే బిగ్‏బాస్ సీజన్ 4లోని ప్రేమ జంటలు చాలా వరకు ఆడియన్స్‏లోకి వెళ్ళాయి. అందులో అఖిల్- మోనాల్ జోడి గురించి చెప్పనక్కర్లేదు. మొదట్లో అభిజిత్, అఖిల్, మోనాల్ మధ్య ట్రయాంగిల్ ప్రేమ నడుస్తుందంటూ బిగ్‏బాస్ స్క్రీన్ చేసినా తర్వాత మోనాల్ అభిజిత్ మధ్య దూరం పెరిగి…అభి హారికకు దగ్గరయ్యాడు. దీంతో అఖిల్ మోనాల్‏కి మరింత దగ్గరయ్యాడు. ఎంతలా అంటే ఒకానోక సమయంలో మోనాల్‏ను సేవ్ చేయడానికి తన వస్తువులు మొత్తం కూడా బిగ్‏బాస్‎‏కు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.

మొదటి నుంచి మోనాల్ గేమ్ అఖిల్ ఆడడం, కేవలం మోనాల్ విషయంలో ఇంటిలోని మిగతా సభ్యులతో గొడవలకు దిగడం జరుగుతూనే ఉంది. అయితే బిగ్‏బాస్ చివరిదశకు రావడంతో అందురూ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. అలాగే అఖిల్ మోనాల్ మధ్య చిన్న చిన్న గొడవలు రావడంతో వీరిద్దరి మధ్య కాస్త దూరం కూడా పెరిగినట్టు కనిపిస్తుంది. అలాగే హారికను కెప్టెన్ చేయడంలో మోనాల్ ప్రదర్శించిన ఆటతీరుతో ఆడియన్స్ నుంచి మెప్పు కూడా పొందింది. అప్పటి వరకు మోనాల్ కోసం అఖిల్ గేమ్ ఆడేవాడు.. ఆ తర్వాత నుంచి మోనాల్ తన ఆటను సొంతంగా ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది.

తాజాగా శనివారం జరిగిన ఎపిసోడ్‏లో మోనాల్-అఖిల్ మధ్య సీరియస్ డిస్కర్షన్ జరిగింది. ఇందులో వీళ్ళిద్దరు ఒకరి గేమ్ గురించి ఒకరు చర్చించుకున్నారు. అఖిల్ దగ్గర కూర్చున్న మోనాల్ ‘మీరు చాలా మారిపోయారు’ అంటూ తెగ సిగ్గుపడిపోయింది. అయితే ‘నీవల్లే నేను ఇలా అయిపోయాను’ అంటూ అఖిల్ తిరిగి సమాధానమిచ్చాడు.  మీరు హారికతో చాలా క్లోజ్ అయ్యారు ఎందుకు?, అడిగి మరీ హగ్గులు తీసుకుంటున్నారు. ఏంటీ కథ? అంటూ అఖిల్‏ను ప్రశ్నించింది మోనాల్. దీంతో నేనుప్పుడూ హారికతో ఒకేలా ఉంటున్నా.. మొదటి నుంచి తను నాతో క్లోజ్‏గానే ఉంటుంది. ఇప్పుడు ఇలా ఎందుకు అడుగుతున్నావు అన్నాడు అఖిల్. దీంతో మోనాల్ సైలెంట్ అయ్యింది.

ఇంకా చదవండి:

బిగ్‏బాస్ సీజన్ 4 ఎలిమినేషన్‏లో ట్విస్ట్.. ఈసారి బిగ్‏బాస్ దత్తపుత్రక కోసం బలయ్యేది అతడేనా..