బిగ్‏బాస్ సీజన్ 4 ఎలిమినేషన్‏లో ట్విస్ట్.. ఈసారి బిగ్‏బాస్ దత్తపుత్రక కోసం బలయ్యేది అతడేనా..

తెలుగు బిగ్‏బాస్ సీజన్ 4 ముగింపుకు ఇంకా కొన్ని రోజులే ఉండడంతో ఆట మరింత ఇంట్రెస్ట్‏గా మారింది. కానీ ఈ షో మొదటి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియలో

బిగ్‏బాస్ సీజన్ 4 ఎలిమినేషన్‏లో ట్విస్ట్.. ఈసారి బిగ్‏బాస్ దత్తపుత్రక కోసం బలయ్యేది అతడేనా..
Follow us

|

Updated on: Dec 05, 2020 | 3:31 PM

Telugu Big Boss season 4: తెలుగు బిగ్‏బాస్ సీజన్ 4 ముగింపుకు ఇంకా కొన్ని రోజులే ఉండడంతో ఆట మరింత ఇంట్రెస్ట్‏గా మారింది. కానీ మొదటి నుంచి ఈ షో ఎలిమినేషన్ ప్రక్రియలో ప్రేక్షకుల నుంచి విమర్శలను ఎదుర్కోంటునే ఉంది. ముఖ్యంగా బిగ్‏బాస్ షోలో కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయడం అనేది ప్రేక్షకుల ఓటింగ్ పరంగానే సాగుతుందని తెలిసినా, ఈ సీజన్‏లో మాత్రం ఓటింగ్స్‏తో సంబంధం లేకుండా ఎలిమినేషన్స్ జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తుంది.

కాగా ఈ 13వ వారానికి వచ్చేసరికి హౌస్‏లో 7గురు సభ్యులు మాత్రమే మిగిలారు. అందులో అభిజిత్, హారిక, అవినాష్, అఖిల్, మోనాల్‏లు నామినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం అందరిలో ఉత్కంఠంగా మారింది. అయితే ఈసారి కూడా బిగ్‏బాస్ దత్తపుత్రిక.. అదేనండి ఆ గుజరాతీ భామా మోనాల్‏ను బిగ్‏బాస్ ఓట్లతో సంబంధం లేకుండా సేవ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా అసలు ఈ గుజరాతి అమ్మాయికి ప్రతిసారి సేవ్ అయ్యేంతలా ఎవరు ఓట్లు వేస్తున్నారనే సందేహం అందరిలోనూ ఉన్నదే.

ఈ వారం నామినేషన్స్‏లో ఉన్న ఐదుగురిలో అభిజిత్, అఖిల్ సేవ్ జోన్‏లో ఉన్నారట. ఇంకా మిగిలిన ముగ్గురిలో మోనాల్‏కే తక్కువ ఓట్లు వచ్చాయని, కానీ ఆమెను కాకుండా బిగ్‏బాస్ అవినాష్‏ను ఎలిమినేట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. మరీ నిజంగానే మోనాల్ సేవ్ అయ్యిందా, అవినాష్‏ను ఎలిమినేట్ చేసారా అనే విషయాలు తెలుసుకోవాలంటే ఆదివారం వరకు వేచిచూడాల్సిందే.