జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని జనసైనికులు కథం తొక్కుతున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ తమ నేత బర్త్ డే నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ హాస్పిటల్స్ కు ఆక్సిజన్ సిలండర్లు అందిస్తున్నారు. కరోనా వైరస్ తరుణంలో తమ అభిమాన నేత పుట్టినరోజును హంగులు, ఆర్భాటాలతో కాకుండా ఈ తరహా సేవకి పూనుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో, జిల్లా ఆసుపత్రులకి ఆక్సిజన్ సిలిలెండర్లు విరాళంగా ఇస్తున్నారు. కరోనా వైరస్ మూలంగా ఆక్సిజన్ అందక అనేకమంది రోగులు చనిపోతున్నట్లు వార్తలు వస్తుండడంతో జనసైనికులు ఈ పనికి పూనుకున్నారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన టీం లే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న జనసేన ఎన్నారై టీంలు కూడా ఈ సేవాకార్యక్రమంలో పాలు పంచుకోవడం విశేషం. యూకే, కువైట్, గల్ఫ్, ఆస్ట్రేలియా, యూఎస్ ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ ఎన్నారై అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొంటు సేవా నిరతిని చాటుతున్నారు. వీరి వివరాలు పేర్లతో సహా జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ధన్యవాదాలు చెబుతోంది.